రాష్ట్రీయం

..మళ్లీ ‘కోలాహలం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: పరిషత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ‘కోలాహలం’ మొదలైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు కావడంతో ప్రతి గ్రామంలోని ఓటర్లతో సదరు అభ్యర్థులు చనువుగా ఉంటారు. జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులతో పాటు, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు కూడా ఓటర్లను పేర్లు పెట్టి పిలిచేంత చనువు ఉంటుంది. ఎంపీటీసీలకైతే ఓటర్లతో చనువు మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి కుటుంబానికి సంబంధించిన సభ్యుల పేర్లను కూడా చాలా మంది అభ్యర్థులు గుర్తుంచుకుని పిలుస్తుంటారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ఇప్పుడు జరగనున్న పరిషత్ ఎన్నికలకు చాలా తేడా ఉంది. లోక్‌సభకు పోటీ చేసిన అభ్యర్థులకు గ్రామాల్లోని నాయకులను కూడా ఖచ్చితంగా గుర్తించలేని పరిస్థితి ఉండేది. కేవలం పార్టీ పేరుతో పార్టీ గుర్తుపైనే ఎక్కువ మంది అభ్యర్తులు ఆధారపడ్డారు. పరిషత్ ఎన్నికలు అలా కాకుండా వ్యక్తిగత పరిచయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా పార్టీ గుర్తులపైనే పోటీ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ వ్యక్తిగత పలుకుబడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫలానా అభ్యర్థి పనిచేసే వాడు, ప్రజల బాగోగులు పట్టించుకునే వాడు అన్న విధంగా ఓటర్లపై ప్రభావం ఉంటుంది. ఈ కారణాల వల్లనే గ్రామాల్లో హడావుడి ఎక్కువగా కనిపిస్తుంది. బ్యానర్లు, గోడరాతలు, పోస్టర్లు వేయడానికి అవకాశం ఉన్నప్పటికీ, అభ్యర్థులు ఎవరూ వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వరు. ఇందుకు కారణం ఖర్చు మాత్రమే. జడ్పీటీసీ అభ్యర్థులుగా బరిలో ఉండేవారు నాలుగు లక్షల రూపాయల వరకు, ఎంపీటీసీ అభ్యర్థులుగా బరిలో ఉండేవారు 1.50 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేసేందుకు అవకాశం ఉంది. అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఖర్చుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిమితి విధించడంతో పరిస్థితి దయనీయంగా ఉంది. అభ్యర్థుల తరఫున వారి అనుచరులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేందుకే ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. అభ్యర్థులు తమ అనుచరులకు భోజనం తదతర అవసరాలను ఏర్పాటు చేయకతప్పదు. అందుకే 22 రోజుల పాటు అంటే ఈనెల 22 నుండి మే 14వ తేదీ వరకు గ్రామాల్లో హడావుడి కొనసాగుతుంది.