రాష్ట్రీయం

పోలవరం బ్యాక్‌వాటర్‌తో తెలంగాణకు ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, ఏప్రిల్ 21: పోలవరం బ్యాక్‌వాటర్‌తో తెలంగాణ రాష్ట్రానికి ముప్పు పొంచి ఉందని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ ఎస్ నర్సింహారావు, ఐఐటీ ప్రొఫెసర్ శశిధర్ అన్నారు. నర్సింహారావు నేతృత్వంలోని అధ్యయన బృందం ఆదివారం పోలవరం బ్యాక్‌వాటర్ వల్ల కలిగే కష్టనష్టాలపై అధ్యయనం చేసేందుకు జిల్లాలో పర్యటించింది. భద్రాచలం, మణుగూరు, అశ్వాపురం, తదితర గోదావరి పరీవాహక ప్రాంతాల్లో బృందం పర్యటించింది. భద్రాచలంలోని గోదావరి కరకట్టను పరిశీలించి ఇక్కడి పరిస్థితులను స్థానిక నీటిపారుదల శాఖ ఈఈ రాంప్రసాద్ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం వారు విలేఖరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే బ్యాక్‌వాటర్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి పరీవాహక ప్రాంతం సుమారు 120 కిలోమీటర్ల మేర ముంపునకు గురవుతుందని చెప్పారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒడిశా, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు ఇదే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు జరిగే నష్టాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని, రక్షణ చర్యల కోసం అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలిపారు. అంతేకాని తాము ప్రాజెక్టును నిలుపుదల చేసేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదని స్పష్టం చేశారు. 16లక్షల క్యూసెక్కుల నీరు నిల్వ ఉంటే భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులు ఉంటుందని, అదే 50లక్షల క్యూసెక్కుల నీరు అయితే మాత్రం నీటిమట్టం భారీగా పెరుగుతుందన్నారు. 1986లో గోదావరికి వచ్చిన వరదలు, వరద సమయంలో భద్రాద్రికి మిగిలిన చేదు అనుభవాలు, నాటి వరద ఉద్ధృతికి సంబంధించిన పూర్తి రికార్డులు సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. తాము ఇప్పటికే ఒక డాక్యుమెంట్ కోర్టుకు ఇచ్చామని, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితిని మరింత అధ్యయనం చేసేందుకు వచ్చామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల పొరుగు రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలో ముంపునకు గురయ్యే ప్రాంతాలకు కూడా ఆర్ అండ్ ఆర్ పరిహారం ఇచ్చి, ఆయా ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం బ్యాక్‌వాటర్ వల్ల పారిశ్రామిక ప్రాంతాలైన సారపాక ఐటీసీ పీఎస్‌పీడీ కర్మాగారం, అశ్వాపురం హెవీవాటర్ ప్లాంట్, మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ఫ్లాంట్ (బీటీపీఎస్)లకు కూడా ప్రమాదం లేకపోలేదన్నారు. పోలవరం ముంపును దృష్టిలో ఉంచుకొని ఒడిశా, చత్తీస్‌గఢ్‌లు 2007లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించాయని, తెలంగాణ రాష్ట్రం ఇటీవలే ఓఎస్-2019 ద్వారా కేసు వేసిందని వెల్లడించారు. పోలవరం ఆథారిటీ ద్వారా కేంద్రం తెలంగాణలోని ముంపు ప్రాంతాలకు ప్యాకేజీలు ఇవ్వాలని పోరాడుతున్నట్లు వివరించారు. ఈ బృందంలో ఈఈలు రాంప్రసాద్, ప్రసాద్, డీఈఈలు రవిశంకర్, మల్లిఖార్జున్‌రావు తదితరులు ఉన్నారు.
చిత్రం... భద్రాచలం కరకట్ట వద్ద గోదావరి పరిస్థితిని పరిశీలిస్తున్న అధ్యయన బృందం