రాష్ట్రీయం

మార్పు మొదలైంది.. కొనసాగిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ): మనస్ఫూర్తిగా నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి సేవ చేయడమే జనసేన పార్టీ ముఖ్య లక్ష్యమని, అది మాత్రమే ప్రజలకు మన పార్టీ చెప్పే నిజమైన కృతజ్ఞత అవుతుందని పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అన్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా అన్ని సమయాల్లో ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం దిశగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. రాజకీయాల్లో మార్పునకు శ్రీకారం చుట్టామని, ఈ ప్రక్రియను ఇలానే కొనసాగించాలన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఎన్నికల్లో అభ్యర్థులకు ఎదురైన అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన వెంటనే వైసీపీ 120 స్థానాలు వస్తాయని, టీడీపీ మాకు ఇన్ని స్థానాలు వస్తాయంటూ లెక్కలు వేయడం మొదలు పెట్టాయన్నారు. కాని జనసేన మాత్రం అలా లెక్కలు వేయడం లేదన్నారు. ఓటింగ్ సరళి ఎలా ఉండిందో మాత్రం పార్టీ నాయకులు తెలుసువాలని తాను సూచించినట్లు చెప్పారు. మార్పు ఎప్పుడైనా చిన్నగానే మొదలవుతుందని, అది మనం ఎదిగే దిశను బట్టి నిర్దేశిస్తుందన్నారు. కాని మార్పు ఎంతవరకు వెళ్తుందో మాత్రం చెప్పలేమన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మార్పును ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. తెలంగాణలో కూడా ఇదే తరహా మార్పును ప్రజలు ఆహ్వానిస్తున్నారని చెప్పారు. అన్నింటికంటే ముఖ్యంగా మీకు అండగా నిలిచిన, మద్దతు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలపడం మాత్రం మరిచిపోవద్దన్నారు. ప్రతి గ్రామానికి ఓరోజు కేటాయించి అందరినీ కలిసి వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. సమస్యలపై బలంగా మాట్లాడాలన్నారు. వాటి పరిష్కారం కోసం పనిచేస్తూ ప్రజలకు సేవ చేయడమే నిజమైన కృతజ్ఞతగా చెప్పారు. పెద్దపెద్ద సమస్యలు వస్తే మాత్రం తాను తప్పకుండా స్పందిస్తానని చెప్పారు. నియోజకవర్గాల వారిగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాలను కొసాగించాలని సూచించారు. 2008లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించినప్పుడే ఓటమి భయం లేని కొత్తతరాన్ని, పోరాటం చేయగలిగిన వారిని రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకున్నట్లు గుర్తుచేశారు. అందరూ సమాజాన్ని మార్చాలనుకుంటారు, కానీ ముందడుగు వేసేవారు మాత్రం అరుదుగా ఉంటారన్నారు. అనేక సమస్యల్ని అధిగమించి జనసేన ద్వారా ఒక ముందడుగు వేశామన్నారు. నిధులు, నియామకాల వ్యవహారంలో తేడా వచ్చినపుడే ఉద్యమాలు పుడతాయన్నారు. తెలంగాణ ఉద్యమం కూడా అలానే పుట్టిందని గుర్తుచేశారు. ప్రతిచోటా రెండు కుటుంబాలే అంతా ఆపరేట్ చేస్తున్నాయన్నారు. ఎవరికి నిధులు వెళ్లాలి, నీరు ఎవరికి వెళ్లాలనే విషయాలు కూడా వారే నిర్ణయించటం దారుణమని పవన్‌కళ్యాణ్ నిరసన తెలిపారు.
పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇది ఒక్క ఎన్నికల కోసమే మొదలుపెట్టిన ప్రయాణం కాదని, నవతరానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే పవన్‌కళ్యాణ్ ముందడుగు వేశారన్నారు. తెలంగాణలో సైతం కార్యకర్తలు జనసేన జెండాను అద్భుతంగా మోశారని చెప్పారు. సమయం తక్కువగా ఉండటం వల్ల కొంత ఇబ్బందిపడినా, అనారోగ్య సమస్య వచ్చినా పవన్ అభ్యర్థుల గెలుపు కోసం తనవంతు కృషి చేశారన్నారు. పార్టీ అధ్యక్షుడి రాజకీయ సలహాదారు రామ్మోహనరావు, రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం, పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... పార్టీ అభ్యర్థులతో ముఖాముఖిలో మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్