రాష్ట్రీయం

పెట్టేబేడా సర్దుకోవడమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: ఏపీ రాజధాని అమరావతిలో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్న సీఎం చంద్రబాబు పెట్టేబేడా సర్దుకునే సమయం దగ్గరపడిందని వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం లోటస్‌పాండ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కౌంటింగ్ తేదీ సమీపిస్తున్నదున ఎన్నికలను రద్దు చేయమన్నా ఆశ్చర్యంలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పాలనా పరమైన విధానాలను అమలు చేయడం చట్టఉల్లంఘన, వ్యతిరేకం అని వైకాపా ఎంపీ నిప్పులు చెరిగారు. పోలింగ్ ముగిసిన తరువాత అప్పులు తెచ్చారని విమర్శించారు. కేవలం తన అనుకూల వర్గాలకు మేలు చేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నించడం దుర్మార్గం అన్నారు. తన ఆదేశాల మేరకే పనులు చేసిపెట్టాలని పరోక్షంగా అధికారులకు హుకుం జారీ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సీఎం వ్యవహారంపై బహిరంగంగా మాట్లాడేందుకు జంకుతున్నారన్నారు. అధికారులతో తప్పులు చేయించడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు బెడసికొడుతున్నాయని ఆయన వెల్లడించారు. త్వరలో చంద్రబాబు మాజీ కాబోతున్నారని, అలాంటి వ్యక్తికి అధికారులు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని విలువైన వస్తువులను దొడ్డిదారిన తరలించడానికే ఈ సమీక్షలు నిర్వహిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈవీఎంలపై ముఖ్యమంత్రి మతితప్పి మాట్లాడుతుంటే అందుకు తాము సైతం అంటూ కాంగ్రెస్ నేతలు వంతపాడడం సిగ్గుచేటని వైకాపా ఎంపీ ధ్వజమెత్తారు. ఏపీలో కాంగ్రెస్, టీడీపీ ఒకటేనన్నారు. ఇద్దరూ కలిసే వైకాపాపై పోరాడినా ఫలితం దక్కదని చెప్పారు.జేడీ లక్ష్మీనారాయణ పార్టీలు మారుస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, అలాంటి వ్యక్తికి రాజకీయాల్లో విలువలులేవన్నారు. రాబోయే రోజుల్లో జేడీ అంటేనే రాజకీయ పార్టీలు తలుపులు మూసేస్తాయని ఆయన జోస్యం చెప్పారు.