రాష్ట్రీయం

ఉరుములతో కూడిన వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: రాష్ట్రంలో క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం తెలిపారు. సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. రాయలసీమ జిల్లా అనంతపురంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా సాధారణం కంటే రెండు డిగ్రీల అదనం. దక్షిణ కోస్తాలో ఒంగోలులో 36డిగ్రీలు నమోదు కాగా, సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికం. ఇక గన్నవరం, బాపట్ల, కర్నూలు పట్టణాల్లో సాధారణం కంటే ఒక డిగ్రీ అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. గన్నవరం 40 డిగ్రీలు, తుని 38 డిగ్రీలు, బాపట్ల, కాకినాడ 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనితో పాటు నార్త్ ఇంటీరియల్ కర్నాటక నైరుతి మధ్యప్రదేశ్, మధ్య కర్నాటక మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది.