రాష్ట్రీయం

ఇంటర్ బోర్డు ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: ఇంటర్మీడియట్ ఫలితాల్లో అనేక మంది విద్యార్థులు ఆశించిన మార్కులు రాకపోవడంతో గత మూడు రోజులుగా కొనసాగుతున్న నిరసనలు సోమవారం నాడు ఆకాశాన్నంటాయి. వేలాది మంది తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు ఇంటర్‌బోర్డును ముట్టడించారు. రోజురోజుకూ ఇంటర్ బోర్డుకు వస్తున్న విద్యార్థులూ తల్లిదండ్రుల సంఖ్య పెరగడంతో వారిని అదుపు చేసేందుకు వందలాది పోలీసులను మోహరించారు. దీంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందితో పోలీసులతో వాగ్యుద్ధానికి దిగాల్సి వచ్చింది. ఒక పక్క ఏబీవీపీ, ఇంకో పక్క బీజేవైఎం నేతలతో పాటు
కాంగ్రెస్ నాయకులు రేవంత్‌రెడ్డి , సంపత్‌కుమార్‌లు బోర్డు వద్ద నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని బోర్డు కార్యాలయం నుండి ఖాళీ చేయించి వేరే పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇంటర్ బోర్డులో జరుగుతున్న గందరగోళంపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్పందించారు. విద్యార్థుల నుండి ఎలాంటి రుసుం తీసుకోకుండానే వారికి రీ వాల్యూయేషన్ చేపట్టాలని, అలాగే పరీక్ష ఫెయిల్ అయినవారికి సైతం ఫీజు వసూలు చేయరాదని వివిధ రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. బోర్డు నిర్వహించిన పరీక్షల ఫలితాల్లో గందరగోళంపై తక్షణం న్యాయవిచారణ జరిపించాలని , బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్‌ను తప్పించాలని, విద్యామంత్రిని బర్త్ఫ్ చేయాలని వారు కోరారు.
రీకౌంటింగ్‌తో న్యాయం చేయండి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఇంటర్ విద్యార్థుల భవితవ్యం దెబ్బతినకుండా రీ కౌంటింగ్ చేపట్టి వారికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి , సీఎల్పీ నేత మల్లు విక్రమార్క లేఖ రాశారు. బోర్డు అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేసిందని లేఖలో ప్రస్తావించారు. 10 లక్షల మంది విద్యార్థుల ఫలితాల విషయంలో ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. అవినీతి ప్రక్షాళన చేస్తామని చెబుతున్న సీఎం ఇంటర్ బోర్డును ఎందుకు ప్రక్షాళన చేయడంలేదని ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డి అరెస్టు
విద్యార్థులు, తల్లిదండ్రులు చేస్తున్న నిరసనలకు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. దీంతో మరోసారి అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సంపత్‌కుమార్, అనిల్‌కుమార్ యాదవ్ కూడా బోర్డు వద్ద బైఠాయించారు. అనంతరం వారందిరినీ బేగంబజార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసు స్టేషన్‌లో కూర్చున్న రేవంత్ రెడ్డిని ఇతర కాంగ్రెస్ నేతలను పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్‌లు కలిశారు.
ఏబీవీపీ నిరసన
ఇంటర్ ఫలితాల్లో అవకతవలకు పూర్తి బాధ్యత వహిస్తూ బోర్డు కార్యదర్శి అశోక్‌ను వెంటనే తప్పించాలని , అసమర్ధ బోర్డు అధికారులను తొలగించాలని, ఉచితంగానే పేపర్ రీ వాల్యూయేషన్ చేసి విద్యార్ధులకు న్యాయం చేయాలని కోరుతూ ఏబీవీపీ నేతలు బోర్డు వద్ద ధర్నా నిర్వహించారు. విద్యార్థులతో చెలగాటం ఆడుతున్న ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని వారు ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. అనంతరం వారందరినీ అరెస్టు చేసి బేగంబజార్ పీఎస్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి కిరణ్, గ్రేడర్ కార్యదర్శి పగిడిపల్లి శ్రీహరి, సీడబ్ల్యుసీ సభ్యుడు ప్రవీణ్‌రెడ్డి, నెక్ సభ్యుడు అయ్యప్ప, సంయుక్త కార్యదర్శులు ఎల్లస్వామి, శ్రవణ్ రెడ్డి, ఆనంద్, రాజేష్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల ఓవర్ యాక్షన్
ఇంటర్ బోర్డు వద్దకు ఆవేదగా వస్తున్న విద్యార్థులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి, తమదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో వచ్చిన ఒక విద్యార్థిని ఆవేశంగా మాట్లాడటంతో పది మంది పోలీసులు విసురుగా ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసు వ్యాన్‌లో పడేశారు. విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు ఇస్తుంటే వారిని తీసుకువెళ్లి వ్యాన్‌ల్లో కూర్చోబెట్టి చేతులకు బేడీలు వేశారు. పోలీసుల తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఇంటర్ బోర్డు కార్యాలయానికి తాళాలు వేశారు.