రాష్ట్రీయం

జీవన్ గెలుపుతో ఉత్తేజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: శాసనసభ ఎన్నికల పరాజయం నేపథ్యంలో ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి విజయం సాధించడం పార్టీకి కొండంత అండగా, ఉత్తేజాన్ని నింపిందని కాంగ్రెస్ సీనియర్ నేతలు కొనియాడారు. జీవన్‌రెడ్డి గెలుపు కాంగ్రెస్‌కు మలుపు ఇవ్వబోతుందన్నారు. ఇదే స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లను గెలువబోతుందన్నారు. గాంధీభవన్‌లో సోమవారం పట్ట్భద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎన్నికైన టి జీవన్‌రెడ్డికి సన్మానం జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, 42 శాసనసభా స్థానాల పరిధిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి విజయం సాధించారన్నారు. శాసనసభ ఎన్నికల్లో జగిత్యాలలో జీవన్‌రెడ్డి ఓడిపోవడం ఈవీఎంలపై అనుమానాన్ని రేపిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ టీఆర్‌ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని విమర్శించారు. 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం టీఆర్‌ఎస్‌ఎల్‌పిలో ఎలా విలీనం అవుతుందని ప్రశ్నించారు. శాసనమండలిలో కాంగ్రెస్ పక్షం లేకుండా చేసి, అదేవిధంగా శాసనసభలో చేయడానికి కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తోన్న టీఆర్‌ఎస్, శాసనసభ, శాసన మండలిని కూడా ప్రగతిభవన్‌లో పెట్టుకుంటే సరిపోతుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బ్యాలెట్ పత్రాలలో నిర్వహించే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందన్నారు. ఈవీఎంల ద్వారా జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో 60 వేలతో ఓడిపోయిన జీవన్‌రెడ్డి, బ్యాలెట్ పత్రాలతో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 40 వేల మెజారిటీతో గెలిచారని గుర్తు చేశారు. కాంగ్రెస్ శాసనసభా పక్షం నాయకుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, కాంగ్రెస్ గుర్తుపై గెలిచి, ఇప్పుడేమో పార్టీపై తమకు నమ్మకం లేదంటున్న ఎమ్మెల్యేలకు సిగ్గు ఉండాలన్నారు. గత ఎన్నికల్లో తమను ఎంతగా ఇబ్బంది పెట్టినా పార్టీ మారలేదన్నారు. ప్రభుత్వంపై ఉద్యమాలు చేశాం తప్ప తాము అమ్ముడు పోలేదని భట్టి అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించినప్పుడు పార్టీ మారే నాయకుల బతుకులు కుక్కలు చింపిన విస్తరాకుగా మారుతాయని భట్టి హెచ్చరించారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జీ ఆర్‌సి కుంతియా మాట్లాడుతూ, జీవన్‌రెడ్డి విజయం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందన్నారు. పార్టీ మారాలనుకుంటున్న ఎమ్మెల్యేలు పునరాలోచించుకోవాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పది సీట్లు గెలుచుకోబోతుందన్నారు. మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ, పార్టీ మారే ఎమ్మెల్యేలను యాచకులుగా అభివర్ణించారు. తనకు జరిగిన సన్మానానికి ధన్యవాదాలు తెలుపుతూ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రతిపక్షం బలంగా లేకపోతే ప్రభుత్వం ఉండదన్నారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతనే తనను ఎమ్మెల్సీగా గెలవడానికి కారణమన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పెట్టుకుంటే ఎప్పటికీ వమ్ము కాదన్నారు. టీఆర్‌ఎస్‌లో సీఎల్‌పీని విలీనం చేసే అధికారం ఎవరికి లేదని జీవన్‌రెడ్డి అన్నారు.

చిత్రం... జీవన్‌రెడ్డి సన్మాన సభలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క