రాష్ట్రీయం

దేశ భవిత విద్యార్థులపైనే ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భారత దేశ భవిష్యత్తు పిల్లలు, యువతపైనే ఆధారపడి ఉందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. ‘లీడ్ ఇండియా 2020 ఉద్యమం’ లో పాల్గొంటున్న విద్యార్థులను (చేంజ్ ఏంజట్స్) ఉద్దేశించి రాజ్‌భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. చేంజ్ ఏజంట్లుగా పనిచేస్తున్న ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు సోమవారం రాజ్‌భవన్ వచ్చారు. లీడ్ ఇండియా ఉద్యమం ప్రతినిధులు కూడా విద్యార్థులతో పాటు ఉన్నారు. లీడ్ ఇండియా 2020 కార్యక్రమం మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం ప్రారంభించారని గవర్నర్ గుర్తు చేశారు. అబ్దుల్ కలాం సాదాసీదా జీవితం గడిపినప్పటికీ, గొప్ప ఆలోచనలు కలిగి ఉండేవారని పేర్కొన్నారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ రాష్ట్ర శాఖ చేపట్టిన కార్యక్రమాలను లీడ్ ఇండియా 2020 ప్రతినిధులు పరిశీలించాలని కోరారు. స్వచ్ఛత, వ్యర్థాల వినియోగం, విద్యుత్ పొదుపు, నీటి సంరక్షణ తదితర అంశాల్లో రెడ్‌క్రాస్ సొసైటీ అమోఘమైన కృషి చేస్తోందని గుర్తు చేశారు. రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు పాఠశాలలకు వెళుతూ, విద్యార్థులకు పరిశుభ్రత తదితర అంశాలపై సూచనలు, సలహాలు ఇస్తుంటారన్నారు. తెలంగాణ రాష్ట్ర శాఖ కూడా ఈ తరహా కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. విద్యార్థులు ఏ అంశంపై కూడా ఇతరులపై ఆధారపడవద్దని, సొంతంగానే పనిచేయాలని గవర్నర్ పిలుపు ఇచ్చారు. పళ్లు, పూల చెట్లను నాటాలని, వాటిని సంరక్షిస్తూ పెంచాలని సూచించారు. సమాజంలోని పేదలు తదితరుల పట్ల విద్యార్థులు దయ కలిగి ఉండాలని, సేవ చేయాలని సూచించారు. పాఠశాలలకు రావడం నిలిపివేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలకు రప్పించేందుకు ఆ యా విద్యార్థుల తల్లితండ్రులతో మాట్లాడాలని గవర్నర్ సూచిచారు. లీడ్ ఇండియా 2020 ఉద్యమంలో బ్యాడ్మింటన్ ప్రపంచ స్థాయి క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ కీలకపాత్ర పోషించడం పట్ల గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు. గోపీచంద్‌ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నతస్థానానికి ఎదగాలని కోరారు. ఈ సమావేశంలో పుల్లెల గోపీచంద్, ప్రొఫెసర్ సుదర్శనా చారి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులతో గవర్నర్ చర్చలు జరిపారు.
చిత్రం... రాజ్‌భవన్‌లో సోమవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతున్న గవర్నర్ నరసింహన్