రాష్ట్రీయం

సుప్రీంలో తేల్చుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 23: అమెరికా, జర్మనీలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈవీఎంలపై నమ్మకం లేక బ్యాలెట్‌పత్రాలతో ఎన్నికలు జరిపిస్తున్నారని, అలాంటిది భారతదేశంలో ఎలా అమలు చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మంగళవారం మహారాష్టల్రో ఎన్నికల ప్రచారానికి ముందు ముంబైలో జాతీయ పార్టీల నేతలతో ఈవీఎంలపై సుదీర్ఘంగా చర్చించారు. వీవీ ప్యాట్ రసీదులు 50 శాతం లెక్కింపుపై బీజేపీయేతర ప్రాంతీయ, జాతీయ పార్టీలతో కలసి సుప్రీం కోర్టురో త్వరలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. గత ఆరు నెలలుగా సేవ్ డెమోక్రసీ పేరుతో దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. కేంద్రంలో సీబీఐ, ఐటీ, ఈడీ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని ధ్వజమెత్తారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని కూడా తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో టీడీపీని టార్గెట్ చేశారని తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలే లక్ష్యంగా దాడులను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడులో డీఎంకేను, మహారాష్టల్రో ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమిని టార్గెట్ చేశారని దుయ్యబట్టారు. ఈవీఎంలపై తమకు అనుమానాలు ఉన్నాయని, టెక్నాలజీని తాను అమలు చేసినంతగా దేశంలో ఎవరూ చేయలేదని చెప్పారు. ఈవీఎంలు ఎలా పనిచేస్తున్నాయో ఎవరికీ తెలీదన్నారు. వీటిని పనిచేయకుండా చేయవచ్చని స్వయాన కేంద్ర ఎన్నికల కమిషనరే అంగీకరించారని గుర్తుచేశారు. కేవలం మూడు, నాలుగు దేశాలు మాత్రమే ఈవీఎంలు వాడుతున్నాయని జర్మనీ వంటి ముందున్న దేశాలు సైతం వాటిని పక్కనపెట్టాయని చంద్రబాబు తెలిపారు. అనుమానాల నివృతి కోసం వీవీప్యాట్ రసీదులను 50 శాతం లెక్కించాల్సిందిగా సుప్రీం కోర్టును కోరామన్నారు. చాలా దేశాలు బ్యాలెట్ పద్ధతినే అనుసరిస్తున్నాయని వివరించారు. ఈవీఎంల్లో రెండు రకాల మిషన్లు ఉంటాయని ఒకటి ఎం-3, రెండవది ఎం-2 వెర్షన్లని చెప్పారు. ఇది చాలా గందరగోళంగా ఉంటుందని మేధావులకే అర్థం కాదన్నారు. ఈవీఎంలను చాలారకాలుగా మలచుకోవచ్చని తెలిపారు. చిప్‌లను తారుమారు చేసే వీలుందని, ఐదు నుంచి పది కోట్లు ఇస్తే ఈవీఎంలను ట్యాంపర్ చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలను చేస్తామంటూ కొందరు మార్కెట్‌లో వేలం నిర్వహించే దైన్యస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితుల్లో కనీసం 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించటం హేయమన్నారు. వీవీ ప్యాట్‌లో రసీదు 7 సెకన్లు కనిపించాల్సి ఉండగా కేవలం మూడు సెకన్లు మాత్రమే కనిపించిందని, తెలంగాణలో ఫారం-7 దుర్వినియోగంతో 25 లక్షల ఓట్లు తొలగించి సారీతో సరిపుచ్చుకున్నారని ఆయన చెప్పారు. ఓటు వేసిన వారి సంఖ్య, పోలైన ఓట్లకు పొంతన కుదరటం లేదని ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనేక అవాంతరాలు జరిగాయని ఆరోపించారు. సీఈఓ కూడా తన ఓటువేసే పరిస్థితి లేదన్నారు. అర్ధరాత్రి వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లోనే ఉన్నారని 50 శాతం వీవీప్యాట్ రశీదులు కచ్చితంగా లెక్కించాల్సిందే అని డిమాండ్ చేశారు. దీనిపై ఎన్నికల సంఘం సుప్రీంకు తప్పుడు సమాచారం ఇచ్చిందన్నారు. బ్యాలెట్ విధానంలో కూడా 24 గంటల్లోనే ఫలితాలు వచ్చేవని చెప్తూ కేవలం 5 శాతం స్లిప్పులు లెక్కిస్తామంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని దీనిపై భావసారూప్యత కలిగిన పార్టీలతో కలసి త్వరలో సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. మోదీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకారిగా మారారని దుయ్యబట్టారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈవీఎంలపై చర్చ జరపటమే తన పర్యటన ఉద్దేశమన్నారు. ఈవీఎంల మొరాయింపుపై అఖిలేష్ ట్వీట్ చేశారని, కేరళలో కూడా అక్రమాలు జరుగుతున్నట్టు సీపీఎం నేత సీతారాం ఏచూరి ఫోన్‌లో ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. మేం గొంతెమ్మ కోర్కెలు అడగటం లేదు. 50 శాతం వీవీప్యాట్లు కచ్చితంగా లెక్కించాల్సిందే అని ఎన్నికల సంఘానికి చంద్రబాబు స్పష్టం చేశారు.

చిత్రం...ముంబయిలో మంగళవారం విలేఖరులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
చిత్రంలో కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్