రాష్ట్రీయం

సర్కార్ సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పిదాలపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పందించలేదని విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో అంతర్గతంగా సీరియస్‌గానే తీసుకున్నట్టు సమాచారం. బయటకు స్పందించకపోయినా సీఎం దీనిని తీవ్రంగానే పరిగణిస్తోన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈ వ్యవహారంపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డిని సీఎస్ తన ఛాంబర్‌కు పిలిపించుకొని వివరణ కోరినట్టు ఈ వర్గాల సమాచారం. ఇంటర్ ఫలితాలలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కమిటీ నివేదిక వచ్చాకే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోన్నట్టు సీఎస్ స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ అంశం విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన సున్నితమైంది కావడంతో రాజకీయం కోణంలో ఎలాంటి విమర్శలు చేయవద్దని కూడా పార్టీ నాయకులకు సూచించినట్టు సమాచారం. అందుకే టీఆర్‌ఎస్ నేతలెవరూ దీనిపై స్పందించకుండా వౌనంగా ఉన్నట్టు తెలిసింది. ఇలా ఉండగా ఇంటర్ ఫలితాల వెల్లడిలో జరిగిన తప్పిదాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డిని వివరణ కోరగా ఆయన మంగళవారం సచివాలయానికి వచ్చి వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ఈ సందర్భంగా సీఎస్ జోషి స్పష్టం చేసినట్టు సమాచారం. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కూడా ఈ ఉదంతాన్ని తీవ్రంగానే పరిగణించారు. ఇతర మార్గాల ద్వారా కూడా కేటీఆర్ దీనిపై ఆరా తీసినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగమే స్పందించాలి తప్ప రాజకీయ కోణంలో ఎదురుదాడి చేయొవద్దని సూచించినట్టు తెలిసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి కూడా పార్టీ అధిష్ఠానం నుంచి సూచనలు వెళ్లినట్టు చెబుతున్నారు.