రాష్ట్రీయం

ఇరకాటంలో ఇంటర్ బోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇంతకాలం ఎన్ని పొరపాట్లు చేసినా రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థుల మార్కులను సవరించుకుంటూ ఎలాంటి ఆరోపణలు లేకుండానే నెట్టుకొస్తున్న ఇంటర్మీడియట్ బోర్డు ఎట్టకేలకు ఇరకాటంలో పడింది. బాలల హక్కుల సంఘం ఫిర్యాదుతో అత్యవసర విచారణ చేపట్టిన హైకోర్టు వేసిన ప్రశ్నలతో ఇంటర్మీడియట్ అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మొత్తం ఫెయిలైన విద్యార్ధుల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయడం, తక్కువ మార్కుల వచ్చాయని చెబుతున్న పాసైన విద్యార్థుల జవాబుపత్రాలను మూల్యాంకనం చేయడం, వచ్చే నెల అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం, ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్ధుల కుటుంబాలను ఆదుకోవడం వంటి అంశాలు అన్నీ హైకోర్టులో చర్చకు రావడంతో ఇంటర్మీడియట్ అధికారుల గుండెలు గుభేలుమంటున్నాయి. హైకోర్టులో వాదనల సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలపై కూడా అధికారులు నీళ్లు నమిలారు. పరీక్ష ఫెయిలైన మూడు లక్షల విద్యార్థుల సమాధాన పత్రాలను 10రోజుల్లో మూల్యాంకనం చేయాల్సిందేనని హైకోర్టు అభిప్రాయపడినపుడు బోర్డు తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచందర్ రావు మాట్లాడుతూ రెండు నెలలు సమయం కావాలని కోరారు. దానికి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ , జస్టిస్ ఏ రాజశేఖరరెడ్డిలతో కూడిన బెంచ్ తొమ్మిది లక్షల మంది జవాబుపత్రాలను దిద్దడానికి రెండు నెలలు పడితే మూడు లక్షల జవాబుపత్రాలకు రెండు నెలల సమయం ఎందుకు పడుతుందని నిలదీశారు. నవ్య అనే విద్యార్థిని విషయంలో తప్పు జరిగిన మాట వాస్తవమేనని బోర్డు కార్యదర్శి అశోక్ మీడియాతో అంగీకరించిన నేపథ్యంలో ముందు బోర్డు తప్పులను సరిదిద్దుకోవాలని చెప్పడమేగాక, ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీకి అందించిన విచారణ అంశాల్లో ఇంటర్మీడియట్ బోర్డు గురించి లేకపోవడంపై కూడా హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎక్కడా జరగని అన్యాయం ఇక్కడ జరిగింది అని హైకోర్టు వ్యాఖ్యానించడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీనికి తోడు ఇంటర్మీడియట్ బోర్డును కూడా విచారణాంశాల్లో చేర్చమనడంతో తమ చాపకిందకు నీరు వస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక వేళ ఫెయిలైన విద్యార్థులు అందరి సమాధాన పత్రాలను దిద్దాల్సిందేనని హైకోర్టు ఆదేశిస్తే అందుకు అనుగుణంగా సబ్జెక్టు నిపుణులను గుర్తించి వారందరితో క్యాంప్ నిర్వహించాల్సి వస్తుంది. అందుకు ఒక పక్క ఏర్పాట్లు చేసుకుంటున్న బోర్డు మరో పక్క మిగిలిన రీ కౌంటింగ్ , రీ వాల్యూయేషన్ ప్రక్రియకు కూడా ఏర్పాట్లు చేస్తోంది.
25 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలుచేయలేదు? హైకోర్టు
తెలంగాణ రాష్ట్రంలో ఈబీసీలకు 25 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలుచేయడం లేదని హైకోర్టు మంగళవారం నాడు ప్రశ్నించింది. విద్యా హక్కు చట్టం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేసినట్టు కనిపించడం లేదని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎ రాజశేఖరరెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలుచ్చింది. తదుపరి విచారణను జూన్ 3కు వాయిదా వేసింది.