రాష్ట్రీయం

ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అఖిల భారత సర్వీసుకు చెందిన 49 మంది ఐఏఎస్, ఐఏఎస్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం పదోన్నతి కల్పిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 26 మంది ఐఏఎస్‌లు, 23 మంది ఐపీఎస్ అధికారులు మొత్తంగా 49 మంది ఉన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో పదోన్నతులు కల్పించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పని చేస్తోన్న అధికారులకే కాకుండా కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్‌పై వెళ్లిన అధికారులు కూడా పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు. ఆరుగురు ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పించగా, ఇందులో ముగ్గురు ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తుండగా, మిగిలిన ముగ్గురు కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. మిగిలిన వారిలో ఒకరికి ముఖ్య కార్యదర్శిగా, నలుగురికి కార్యదర్శులుగా, ఆరుగురికి ఆదనపు కార్యదర్శులుగా, ఐదుగురికి సంయుక్త కార్యదర్శులుగా పదోన్నతులు లభించాయి. అలాగే ఐదుగురు ఐపీఎస్ అధికారులకు అదనపు డీజీలుగా, నలుగురికి ఐజీలుగా పదోన్నతి కల్పించగా ఇందులో ఒకరు కేంద్ర సర్వీసులో కొనసాగుతున్నారు. అలాగే ఏడుగురికి డీఐజీలుగా పదోన్నతి లభించింది. అలాగే మరో ఆరుగురికి సీనియర్ స్కేల్ అధికారులుగా పదోన్నతి కల్పించింది. వీరి పదోన్నతులకు సంబంభించి వేర్వేరుగా 15 ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి మంగళవారం విడుదల చేశారు.