రాష్ట్రీయం

మే 3నుంచి యాత్రికుల సంక్షేమ, సౌకర్యాల సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 23: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ నూతనంగా ప్రవేశ పెట్టిన యాత్రికుల సంక్షేమ, సౌకర్యాల సేవకు మే 3వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తిరుమల జేఈఓ శ్రీనివాస రాజు తెలిపారు. మంగళవారం తిరుమలలోని గోకులం అతిథిభవనం వద్ద జరిగిన సమావేశంలో ఆయన ఐటీ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికల వారు ఆన్‌లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మే 11వ తేదీన తిరుమలలోని కల్యాణ వేదిక వెనుకవైపు ఉన్న శ్రీవారి సేవ భవన సముదాయంలో రిపోర్టు చేయాలని, 12వ తేదీ నుంచి సేవలు చేయాల్సి ఉంటుందన్నారు. పిడబ్ల్యుఎఫ్‌ఎస్ సేవకులు తిరుమలలో టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు భక్తులకు చేరుతున్నాయా లేదా అని తెలుసుకోవడమే ఈ సేవ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండే సమయం, దర్శనానికి వదిలే సమయం, అన్నప్రసాదాల వివరాలు, ఎల్‌ఈడీ స్క్రీనింగ్‌లో సరిగ్రా ప్రదర్శితమవుతున్నాయా, లేదా అని చూడాలన్నారు. యాత్రికులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు సక్రమంగా అందేలా, పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేలా పర్యవేక్షించాలన్నారు. అత్యవసర సమయాలలో వైద్య సదుపాయాలు అందించేలా చూడాలన్నారు. యాక్సెస్ కార్డుపై అవగాహన, భక్తులకు అవసరమైన ముఖ్య సమాచారాన్ని తెలియజేయాల్సి ఉంటుందని తెలిపారు. పిడబ్ల్యుఎఫ్‌ఎస్ సేవకు వచ్చే మహిళలు, పురుషులు తాము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో గెజిటెడ్ హోదా కలిగి 35 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. అలాగే ప్రైవేట్ రంగ సంస్థల్లోనివారు పర్యవేక్షణ స్థాయిలో నిర్వహణ సామర్థ్యం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ టి.రవి, సహాయ ప్రజాసంబంధాల అధికారి నీలిమ, ఐటీ విభాగం అధికారి శ్రీనాథముని ఇతర అధికారులు పాల్గొన్నారు.