రాష్ట్రీయం

తపు ప జరిగింది.. బాధ్యులు తేలాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళంపై నియమించిన త్రిసభ్య కమిటీ ప్రాధమిక నివేదికను రూపొందించినట్టు సమాచారం. ఈ నివేదికను నేడో రేపో ప్రభుత్వానికి అందజేయనుంది. కొంత మంది విద్యార్ధుల ఫలితాలు తారుమారు కావడంపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం ఇందుకు బాధ్యులు ఎవరో తేల్చేందుకు 22వ తేదీన ముగ్గురు సాంకేతిక నిపుణులతో కమిటీని నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్థన్‌రెడ్డి జీవో 41ను జారీ చేశారు. కమిటీలో తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ డైరెక్టర్ జీవీ వెంకటేశ్వరరావు, బిట్స్ పిలానీ ప్రొఫెసర్ ఏ వాసన్, ఐఐటీ ప్రొఫెసర్ నిషాంత్ డోంగ్రీలను నియమించారు. ఈ కమిటీ మంగళవారం నాడు, బుధవారం నాడు సుదీర్ఘంగా విద్యాశాఖ, ఇంటర్ బోర్డు అధికారులు, సాఫ్ట్‌వేర్ ఏజన్సీ గ్లోబరీనా ప్రతినిధులతో చర్చించింది. వారిచ్చిన వివరాలతో ప్రాధమిక నివేదికను రూపొందించింది. సాఫ్ట్‌వేర్ వినియోగానికి ఇంటర్ బోర్డుకు సేవలు అందిస్తున్న గ్లోబరీనా కాంట్రాక్టు అగ్రిమెంట్ ప్రకారం అన్ని విధులను సక్రమంగా నిర్వహించిందా లేదా సకాలంలో ఫలితాల ప్రక్రియకు సరిపడా సిబ్బందిని వినియోగించారా లేదా సకాలంలో అన్ని పరిశీలించడం జరిగిందా లేదా ఏజన్సీ కారణంగా ఏమైనా పొరపాట్లు దొర్లాయా ? తప్పులు తగ్గించడానికి సంస్థ తీసుకున్న చర్యలు ఏమిటో కూడా ఈ కమిటీ పరిశీలించింది. చాలా కీలక అంశాల్లో ప్రధానంగా పరీక్షల మూల్యాంకనం, మార్కుల నమోదు, పున:పరిశీలన దశల్లో అవసరమైన ‘ఫైర్‌వాల్స్’ను, సాఫ్ట్‌వేర్ పరిష్కారాలను కలిగి లేదనే వాదన తెరమీదకు వచ్చింది. మార్కుల నమోదు సమయంలోనే ఆటోమెటిక్ రీ వెరిఫికేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఏజన్సీ కలిగి ఉంటే ఇన్ని సమస్యలు ఎదురయ్యేవి కావని తేలింది. అయితే వౌలిక డాటా దశలో కూడా కొన్ని పొరపాట్లు జరిగినట్టు చెబుతున్నారు. డాటా ఎంట్రీ పూర్వదశలో జరిగిన పొరపాట్లను కూడా కమిటీ గుర్తించినట్టు తెలిసింది. అయితే ఈ పొరపాట్లకు బాధ్యులను గుర్తించే పనిని ప్రభుత్వానికే వదిలేసినట్టు తెలిసింది. పొరపాట్లు నిజమేనని, అయితే బాధ్యులను గుర్తించి, వారిని ఏ రూపంలో శిక్షించాలనేది ప్రభుత్వమే నిర్ణయించాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బుధవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలోనూ త్రి సభ్య కమిటీ నివేదిక అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. సోమవారం నాడు హైకోర్టులో ప్రభుత్వం తరఫున సమర్పించే అఫిడవిట్‌లో ఫెయిలైన వారికి ఉచితంగా పున: మూల్యాంకనమా లేదా పున: పరిశీలన చేస్తారా అనే అంశంపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ప్రభుత్వం తరఫున తీసుకోబోయే చర్యలపై కూడా నివేదిక ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో త్రిసభ్య కమిటీ నివేదిక చాలా కీలకం కానుంది.