రాష్ట్రీయం

పరిషత్ ఎన్నికల హడావుడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: జిల్లా ప్రజా పరిషత్ (జడ్పీపీ), మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) ప్రాదేశిక సభ్యుల ఎన్నికలకు సంబంధించి తొలిదశ నామినేషన్ల ఘట్టం బుధవారం సాయంత్రానికి ముగిసింది. జడ్పీటీసీ స్థానాలకు దాదాపు 1600 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు పదివేలకుపైగా నామినేషన్లు దాఖలయ్యాయని బుధవారం రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం తెలిసింది. నామినేషన్ల పరిశీలన గురువారం జరుగుతుంది. నామినేషన్లు సక్రమంగా లేకపోతే
తిరస్కరించినట్టు ప్రకటిస్తారు. గురువారం సాయంత్రం 5 గంటల తర్వాత అర్హత కలిగిన అభ్యర్థుల పేర్లతో జాబితాను రిటర్నింగ్ అధికారులు వెల్లడిస్తారు. రిటర్నింగ్ అధికారులు తిరస్కరించిన నామినేషన్లకు చెందిన అభ్యర్థులు తమకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఉన్నతస్థాయిలో ఫిర్యాదు (అప్పీల్) చేయవచ్చు. తిరస్కరించిన విధానాన్ని అప్పీల్ ద్వారా సవాల్ చేయవచ్చు. ఎంపీటీసీ స్థానానాకి సంబంధించిన అభ్యర్థులు సంబంధిత ఆర్డీఓ లేదా సబ్-కలెక్టర్‌కు, జడ్పీటీసీకి చెందిన అభ్యర్థులు జిల్లా కలెక్టర్‌కు ఈ నెల 26 సాయంత్రం ఐదు గంటలలోగా అప్పీల్ చేసుకోవాలి. 27 న సాయంత్రం ఐదు గంటల వరకు ఈ అప్పీళ్లపై ఆర్డీఓలు, కలెక్టర్లు తీర్పు వెల్లడిస్తారు. అభ్యర్థులు ఎవరైనా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలనుకుంటే ఏప్రిల్ 28 న సాయంత్రం 3 గంటలలోగా ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లను రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. తొలిదశ పోలింగ్ 2019 మే 6 న నిర్వహిస్తారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. పోలింగ్‌కోసం బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులే వాడతారు. పోలింగ్ తర్వాత వీటిని స్ట్రాంగ్‌రూంలకు తరలించి, 2019 మే 27 న లెక్కిస్తారు.