రాష్ట్రీయం

ఇంటర్ విద్యార్థుల మరణ మృదంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మలరామారం / శంకరంపేట, బాల్కొండ, ఏప్రిల్ 24: రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతునే ఉన్నాయ. బుధవారం ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు, యాదాద్రి భువనగరి, మెదక్, నిజామాబాద్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని మితి (19) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బీబీనగర్ మండల కేంద్రంలోని ఇన్నోవేటివ్ కళాశాలలో ఇంటర్ విద్యను పూర్తిచేసుకున్న మితి ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాలలో ఫిజిక్స్, జువాలజీ రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయినట్లుగా ఫలితాలు రావడంతో మనస్తాపానికి గురైన మితి తెల్లవారుజామున ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తండ్రి ఆకారపు రవీంద్రాచారి తెలియజేసారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు దర్పాప్తు చేపడుతున్నట్లుగా ఎస్సై వెంకటేశ్ తెలియజేసారు. ఇంటర్‌బోర్డు చేసిన తప్పులకు విద్యార్థులు మనస్తాపానికి గురై మరణిస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు వాపోయారు. అలాగే, మెదక్ జిల్లా శంకరంపేటలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలో ఫెయలయ్యానని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మడూరు గ్రామానికి చెందిన చాకలి పల్లెరాజు (18) ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో రెండు సబ్జెక్ట్‌లు తప్పడంతో మనస్తాపానికి గురై గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. మృతుని తండ్రి శివరాములు ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ ప్రకాశ్‌గౌడ్ మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా అసుపత్రికి తరలించామన్నారు. నిజామాబాద్ జిల్లా మండల కేంద్రమైన బాల్కొండకు చెందిన శైలజ (17) అనే ఇంటర్ విద్యార్థిని బుధవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శైలజ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో హాస్టల్‌లో ఉంటూ ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. ఇటీవలే ఇంటర్ వార్షిక ఫలితాలు విడుదలైన సందర్భంగా ఆమెకు వేయి మార్కులకు గాను 876 మార్కులు వచ్చాయి. అప్పటి నుండి శైలజ కొంత ముభావంగానే ఉంటూ వస్తోందని స్థానికులు చెబుతున్నారు. తాను ఆశించిన రీతిలో మరింత ఎక్కువగా మార్కులు రాలేకపోయాయనే బెంగతో తనతో తాను కుమిలిపోయి ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 7.30గంటల వరకు కూడా కుటుంబ సభ్యులందరితో కలిసి ఆరుబయట గడిపిన శైలజ, అనంతరం ఇంట్లోకి వెళ్లి ఓ గదిలో ఫ్యానుకు తన చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి అనంతరం కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లి చూడగా, ఫ్యానుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. మార్కులు తక్కువగా వచ్చాయన్న మనస్థాపంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు.

చిత్రాలు.. మితి *చాకలి పల్లెరాజు