ఆంధ్రప్రదేశ్‌

అమర్‌నాథ్ యాత్రికులకు కొత్త కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: అమర్‌నాథ్ యాత్ర తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్ద సవాలుగా మారింది. ఈ ఏడాది యాత్రకు సమగ్ర మెడికల్ సర్ట్ఫికెట్ తప్పనిసరి చేయడం, జంటనగరాల్లో కేవలం ఆరుగురు ప్రభుత్వ వైద్యుల పేర్లను మాత్రమే బోర్డులో చేర్చడంతో యాత్రికుల కష్టాలు అలవికానివిగా మారాయి. ఉస్మానియా ఆస్పత్రికి చెందిన ముగ్గుర్ని, గాంధీ ఆస్పత్రికి చెందిన ముగ్గుర్ని అధీకృత వైద్యులుగా అమర్‌నాథ్ యాత్రా బోర్డు గుర్తించింది. అలాగే నిజామాబాద్‌లో ప్రభుత్వ వైద్యశాల వైద్యులు ముగ్గుర్ని, వరంగల్ కాకతీయ ఆస్పత్రి, ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్‌లో ఇద్దరు వైద్యులను గుర్తించింది. వీరంతా చాలా వరకూ ప్రొఫెసర్ స్థాయి అధికారులు కావడంతో సామాన్య యాత్రికులకు అందుబాటులో లేరు. అదే పరిస్థితి ఆంధ్రాలోనూ ఉంది. కెజిహెచ్‌లో ఒకర్నీ, కర్నూలు, తిరుపతి, అనంతపురం, గుంటూరు, కాకినాడ, విజయవాడ, కడప, ఒంగోలు, శ్రీకాకుళం పట్టణాల్లో ఒక్కో ప్రభుత్వ వైద్యుడిని మాత్రమే గుర్తించారు. రెండు రాష్ట్రాల నుండి లక్ష మందికి పైగా అమర్‌నాథ్ యాత్రకు వెళ్తుంటారు. యాత్రలకు వెళ్లేవారంతా సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించుకోవల్సి ఉంటుంది. మధుమేహం లేదని, బిపి లేదని, హృద్రోగం లేదని వైద్యులు నిర్ధారించాల్సి ఉంటుంది. అలాగే కీళ్ల నొప్పులు, రక్త సంబంధ వ్యాధులు లేవని, చెవి పోటు లేదని, పొగత్రాగడం లేదని, ఆస్తమా సహా నరాల జబ్బు లేదని కూడా నిర్ధారించాలి. ఇవన్నీ నిర్ధారించాలంటే వైద్యులు చాలా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇన్ని పరీక్షలు చేయడానికి ఒక్కొక్కరికి వారం పది రోజులు పడుతుంది. రిపోర్టులు రావాలంటే మరో నాలుగైదు రోజులు పడుతుంది. వైద్య ఫిట్‌నెస్ సర్ట్ఫికేట్ లేకుంటే ఆలయ రిజిస్ట్రేషన్‌ను బ్యాంకుల్లో చేయడం లేదు. ఈ వ్యవహారాలు ఏవీ చెప్పకుండానే దరఖాస్తు చేసుకున్న వారు కొద్ది మంది వైద్యుల పేర్లను ఖరారు చేయడంతో ఆస్పత్రులకు వెళ్లి అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వారి అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆస్పత్రులు సైతం యాత్రికుల కోసం కౌంటర్లు లేదా ప్రత్యేక వేళలు పాటించకపోవడంతో ఉదయానే్న చేరుకున్నా ఎలాంటి పరీక్షలు జరగకుండానే వెనుదిరగాల్సి వస్తోంది. చాలా పరీక్షలకు నిజానికి ఆస్పత్రుల్లో సౌకర్యాలే లేవని, బయట పరీక్షలు చేయించుకోమంటే లేని పోని ఆరోపణలు వస్తాయని భయపడుతున్నామని ఉస్మానియాకు చెందిన ఒక వైద్యుడు వాపోయాడు. యాత్రికులు ఆరు ఫోటోలు, ఆధార్ కార్డుతో సహా బ్యాంకులకు రావల్సి ఉంటుంది. అవన్నీ తెలియకపోవడంతో కూడా కొంత మంది వెనుదిరగాల్సి వస్తోంది.