తెలంగాణ

కాకతీయ ప్రధాన కాలువకు శరవేగంగా మరమ్మతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 10: కరీంనగర్ జిల్లాలో కాకతీయ ప్రధాన కాలువ మరమ్మతు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాలువ ఆధునీకరణ, మరమ్మతు పనులకు ప్రభుత్వం రూ.130 కోట్లు మంజూరు చేసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి సాగునీరు కాకతీయ కాలువ ద్వారా ఎల్ ఎండిలోకి వస్తోంది. అలాగే ఎల్‌ఎండి నుండి కాకతీయ ప్రధాన కాలువ ద్వారా వరంగల్, ఖమ్మం జిల్లాలకు సాగునీరు 3.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు అందుతోంది. మొత్తం 280 కిలోమీటర్ల దూరం కాకతీయ కాలువ విస్తరించి ఉంది. గత కొద్ది సంత్సరాలుగా మరమ్మతులు లేక ప్రధాన కాలువ శిధిలావస్థకు చేరుకుంది. కాలువ మొత్తం సిల్టు పేరుకుపోయి, చాలాచోట్ల లైనింగ్ చెదిరిపోయి, గేట్లు, చానళ్లు అధ్వాన్న స్థితికి చేరి ఆయకట్టుకు నీరందని దుస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు లేక, కాకతీయ ప్రధాన కాలువకు కూడా నీటి సరఫరా లేనందున మరమ్మతులకు ఇది సరైన సమయమని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నిర్ణయించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. దీంతో టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయి గత రెండు నెలలుగా మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి. కాలువలో పేరుకు పోయిన సిల్టును తొలగిస్తూ, లైనింగ్ చెదిరిపోయిన చోట్ల లైనింగ్, మరమ్మతులు చేస్తున్నారు. పలుచోట్ల కాలువ కట్ట ఎత్తును, అప్రోచ్ రోడ్డును ఎత్తును కూడా పెంచుతున్నారు. ఈ పనులు వేసవిలోపు పూర్తయ్యే అవకాశం ఉంది. పనుల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ పనులు పూర్తయితే కాలువకు మళ్లీ పూర్వవైభవం వస్తుందని రైతులు భావిస్తున్నారు. ప్రతిసారి ఆయకట్టుకు నీరందడం లేదని ఖమ్మం వరంగల్ జిల్లాల ఆయకట్టు రైతులతో పాటు కరీంనగర్ జిల్లా శివారు గ్రామాల రైతులు కూడా వాపోతున్నారు. దీంతో పాటు అక్కడక్కడా యూటీలకు గండ్లు పడి పలుసార్లు నీటి సరఫరా నిలిపివేయాల్సిన దుస్థితి తలెత్తేది. కాకతీయ ప్రధాన కాలువ మరమ్మతు పనుల పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనులు నాణ్యతతో పూర్తి చేయించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. భవిష్యత్తులో కాలువ సామర్థ్యాన్ని పెంచే అలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
మరి డిస్ట్రిబ్యూటరీల సంగతేంటి?
కాకతీయ ప్రధాన కాలువకు మరమ్మతులు చేయడం మంచిపనే అని, కానీ డిస్ట్రిబ్యూటరీల సంగతేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాకతీయ ప్రధాన కాలువకు అనుబంధంగా యాభై వరకు డిస్ట్రిబ్యూటరీలు, వీటికి అనుబంధంగా మైనర్లు, సబ్ మైనర్లు ఉన్నాయి. సాగునీటి సరఫరా ఆయకట్టుకు జరిగేందుకు ఇవి కూడా ముఖ్యమే. అయితే వీటి స్థితి కూడా అధ్వాన్నంగా ఉంది. ఎక్కడికక్కడ మట్టికూరుకుపోయి, లైనింగ్‌లు చెదిరిపోయి పలుచోట్ల చెట్లు కూడా పెరిగి అధ్వాన్నంగా మారాయి. వీటి నిర్వహణకు పెద్ద ఎత్తున నిధులు అవసరమున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పెద్ద ఎత్తున మరమ్మతులకు నోచుకోలేదు. వీటి నిర్వహణ కూడా సరిగా లేక ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రెండో విడతలో డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు, సబ్ మైనర్లు, ఫీడర్ చానళ్ల మరమ్మతులపై దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు.