తెలంగాణ

12 శాతం ఇవ్వకుంటే ఓట్లు అడగొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 10: మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్, దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించాలని ఎఐసిసి అధికార ప్రతినిధి, నిజామాబాద్ మాజీ ఎంపి మధుయాష్కి డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లో డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయంతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల రీడిజైన్‌ల పేరిట అక్రమాలకు పాల్పడుతున్నారని, రాజకీయ లబ్ధి, ఆస్తులు పెంచుకునేందుకే రీడిజైన్‌లకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైన్‌లపై శే్వతపత్రం విడుదల చేయాలని, లేనిపక్షంలో సేవ్ తెలంగాణ, సేవ్ డెమోక్రసీ పేరుతో ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ రీడిజైన్‌లపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బంగ్లాలు, కార్లు కొనలేదా ? ఇదంతా అవినీతి సొమ్ము కాదా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల రీడిజైన్‌లపై సమగ్ర నివేదిక తయారుచేసి ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను, ప్రజల సొమ్మును రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. తెలంగాణ సాధన కోసం అమరులైన అమరవీరుల కుటుంబాలను ప్రభు త్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎండలు తీవ్రమై వడదెబ్బతో జనం చనిపోతుంటే, కనీసం ప్రజ ల్లో అవగాహన కల్పించి వడదెబ్బ నివారణ చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని అన్నారు. బీడీ కట్టలపై పుర్రె గుర్తు 80 శాతాన్ని తాము ఎంపిలుగా పోరాటం చేసి సైజు తగ్గించామని, టిఆర్‌ఎస్, బిజెపి ఎంపిలు ఈ విషయంలో పట్టించుకోవడం లేదని, ఫలితంగా 80 శా తం పుర్రె గుర్తు అమల్లోకి వస్తుందని మధుయాష్కి తెలిపారు. ఈ కర్ర రాజశేఖర్, ప్రకాష్, జయశ్రీ, శ్రీనివాస్ పాల్గొన్నారు.