రాష్ట్రీయం

తెలు‘గోడు’ పాలకులకు పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: మోసపోయి గల్ఫ్‌లో గోసపడుతున్న తెలు‘గోడు’ పాలకులకు పట్టదా..? గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టి బాధితులకు బాసటగా నిలిచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతినబూనాలని గల్ఫ్ రిటర్నింగ్ వెల్ఫేర్ సొసైటి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ చాంద్‌పాషా అన్నారు. ఉన్న ఊళ్లో ఉపాధికరువై బ్రతుకుదెరువుకోసం గల్ఫ్ బాట పట్టి అక్కడ చేతినిండా పని దొరకక భారతీయులు అర్ధాకలితో అలమటిస్తుండగా, మరికొందరు పస్తులుండి తలదాచుకుంటున్నారని, ఏజెంట్ల మోసాలతోనే ఇదంతా జరుగుతుందని పాలకులు స్పందించి చట్టాలను కఠిన తరం చేస్తే తప్పా గల్ఫ్ మోసాలు అరికట్టడం అసాధ్యమని షేక్ చాంద్‌పాషా శనివారం పలువురు గల్ఫ్ బాధిత కుటుంబాలను కలిసిన అనంతరం విలేఖరుల ఎదుట వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లినవారికి చేతినిండా పనిదొరకక ఆకలి బాధలకు తాళలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకోగా కనీసం కడసారి చూపుకు నోచుకోని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు అక్కడ మరణించినా పట్టించుకోరని, కంపెనీలలో సరిగా పనిలేక పారిపోయి ఇతర చోట్ల ఉపాధి మార్గాలు ఎంచుకుంటున్న వారిని అక్కడి పోలీసులు అరెస్ట్‌లు చేసి జైళ్లలో పెడుతుండగా నరకయాతన అనుభవిస్తున్నారని వివరించారు. తెలిసోతెలియకో ఏజెంట్ల మాయ మాటలను నమ్మి పరాయి దేశం వెళ్లి అక్కడ క్షణమొక యుగంగా కాలం గడుతున్న వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర పాలకులు చర్యలు చేపట్టి గల్ఫ్ బాధిత కుటుంబాలకు బాసటగా నిలువడంతోపాటు ఆర్థికంగా చేయూతనిందించి ఆదుకోవడం, ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఏజెంట్ల మోసాలకు అనేక మంది అమాయకులు ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో నరకయాతన అనుభవిస్తున్నారని వివరించారు. విజిటింగ్ వీసాలతో గల్ఫ్ దేశాలకు పంపించడంతో మరికొందరు ఇబ్బందులు పడుతున్నారని, వారిని కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టాలని కోరారు. అక్కడ మరణించిన వారి కడసారి చూపుకోసం ఉన్న ఊరు, కన్న వారు అనేక రోజులుగా ఎదురు చూసిన చాలా మంది చివరిసారిగా చూసుకోలేకపోతున్నారన్నారు. గల్ఫ్ బాధిత కుటుంబాల ఆదుకునేందుకు బడ్జెట్‌లో గతేడాది రూ.100 కోట్లు కేటాయించినట్లు సీఎం కేసీఆర్ చెప్పినా ఇందులో ఇంతవరకు ఎంత మంది గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారో వెల్లడించాల్సిన అవసరముందని అన్నారు. గల్ఫ్‌లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని జిఓ ఇచ్చిన ఇంతవరకు అమలుచుకునోచుకోలేదని, వెంటనే పునరుద్ధరించాలని కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. లేకపోతే గల్ఫ్ బాధితులను అందరినీ ఐక్యం చేసి పాలకుల కళ్ళు తెరిపించే వరకు రాజీలేని పోరాటాలు కొనసాగిస్తామని గల్ఫ్ రిటర్నింగ్ వెల్ఫెర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ చాంద్‌పాషా హెచ్చరించారు.