రాష్ట్రీయం

ఇంటర్ అక్రమార్కులను కాపాడుతున్న ప్రభుత్వం: చాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: ఇంటర్మీడియట్ ఫలితాలలో అక్రమార్కులను ప్రభుత్వం కాపాడుతోందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. దీక్షలు చేస్తున్న ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి గాంధీ ఆస్పత్రికి తరలించగా, చాడ వెంకటరెడ్డి గాంధీ ఆస్పత్రికి వచ్చి వారితో దీక్షలను విరమింపచేశారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ ఇంటర్ బోర్డు అక్రమాలకు కారణమైన బాధ్యులను కేసీఆర్ ప్రభుత్వం కాపాడుతోందన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం చేతకాక గుళ్లు, గోపురాలను తిరుగుతున్నారని ఫెడరల్ ఫ్రంట్ పట్టుకుని పరిపాలనను గాలికి వదిలేశారని ఆరోపించారు. గ్లోబరీనా సంస్థను ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఈ సంస్థతో కేటీఆర్‌కు చీకటి ఒప్పందం ఉందని చెప్పారు. 2015లోనే జేఎన్‌టీయూ కాకినాడలో ఈ సంస్థ చేసిన అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. విద్యార్థులు చనిపోతే ప్రరామర్శ కూడా లేదని మండిపడ్డా రు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో చూపిన శ్రద్ధ విద్యాశాఖ పర్యవేక్షణలో చూపడం లేదని విమర్శించారు.