రాష్ట్రీయం

ఆర్టీసీపై టీడీపీ నేతల కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), మే 11: సామాన్య, మధ్య తరగతి, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ఆర్టీసీని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి ప్రస్తుతం అస్థిత్వం కొల్పోయేటట్లు చేసిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. ఆర్టీసీపై టీడీపీ నేతల కన్ను పడిందని అందుకే ఆర్టీసీకి తీరని అన్యాయం చేసి ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలోనికి రాగానే ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు. నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంస్థను కాపాడుకుంనేందుకు ఆర్టీసీ కార్మికులు ఆహర్నిశలు చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. కానీ సంస్థ నష్టాల బాట పట్టడానికి చంద్రబాబు విధానాలే కారణమన్నారు. ఆర్టీసీ పై కన్ను వేసిన టీడీపీ నేతలు సంస్థను నష్టాల ఉబిలోకి నెట్టారన్నారు. సంస్థ మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితికి తీసుకువచ్చారన్నారు. వ్యవస్థలను ధ్వంసం చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించి తరువాత వాటిని ప్రైవేటు సంస్థలకు తెగనమ్మడం, అనంతరం తన మనుషులకు అప్పజెప్పడం బాబుకు అలవాటేనన్నారు. గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బాబు కష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడుకునేందుకు ఒక్క చర్య కూడా తీసుకోలేదన్నారు. ట్యాక్స్‌ల రూపంలో ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఎంవీ ట్యాక్స్‌ను సైతం తగ్గించే ప్రయత్నం చేయలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే డీజీల్, పెట్రోల్‌పై అధిక ట్యాక్స్‌లను వసూలు చేస్నున్నారని ఆరోపించారు. వీటన్నింటి కారణంగానే ఆర్టీసీ నష్టాల ఉబిలోకి వెళ్లిందన్నారు. ఆర్టీసీ నష్టాలకు నూటికి నూరు శాతం చంద్రబాబే కారణమన్నారు. పోలవరం విహార యాత్రలు, ధర్మపోరాటం, నవ నిర్మాణ దీక్షలు, డ్వాక్రా సదస్సుల కోసం మనుషులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను వాడుకొని ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు సంస్థకు బకాయి పడిందన్నారు. తన స్వలాభం కోసం వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న బాబు ఆర్టీసీని అప్పుల నుండి ఎందుకు గట్టెంక్కించ లేకపోతున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా మారుమూల గ్రామాల్లో కూడా ఎమి జరుగుతుందో చెప్పగలను అంటున్న బాబు, ఆర్టీసీ నష్టాలకు కారణాలను మాత్రం ఎందుకు తెలుసుకోలేక పోయారన్నారు. ఎప్పుడూ సమీక్షలు చేసే చంద్రబాబు ఆర్టీసీ సంస్థపై ఎందుకు సమీక్ష నిర్వహించలేదని ప్రశ్నించారు. దొంగ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లల ద్వారా బాబుకు చెందిన మనుషులు, వందల కోట్ల కొల్లగొడుతూ ఆర్టీసీని నష్టపరుస్తున్నారని, ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాకు నాయకుడు చంద్రబాబేనన్నారు. కొద్ది రోజుల్లో అధికారంలోనికి రానున్న వైసీపీ తప్పకుండా ఆర్టీసీని ఆదుకుని ప్రభుత్వంలో విలీనం చేసి, సంస్థకు పూర్వవైభవం తీసుకు వస్తుందన్నారు. ఆర్టీసీకి బంగారు రోజులు రాబోతున్నాయని, సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, యాజమాన్యం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోవడంలో మంత్రులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. రైతులు పండించిన పంటకు, ధాన్యానికి గిట్టుబాటు ధర లేక, ఎక్కడ అమ్ముకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉంటే మంత్రులు కనీసం పట్టించుకోవడం లేదన్నారు.
చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కొలుసు పార్థసారథి