రాష్ట్రీయం

ఆర్టీసీని ముంచేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: పోలవరం విహార యాత్రల పేరుతో ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తీసుకెళ్లి వందల కోట్లు బిల్లులు చెల్లించకుండా ముంచేశారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీ పీకల్లోతు నష్టాలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని యాజమాన్యం దృష్టికి తీసుకువస్తే సంస్థే నష్టాల్లో ఉందని, దాన్ని అధిగమించేందుకు చార్జీలు పెంచాల్సిన పరిస్థితి నెలకొందని ఆర్టీసీ ఎండీ ఎన్‌వీ సురేందర్ బాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు అధర్మపోరాట దీక్షకు అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రజలను తరలించిన విషయం ఎండీకి తెలియదా?అని ఆయన నిలదీశారు. చంద్రబాబుకు ఏనాడు ఆర్టీసీపై ప్రేమలేదని ఆయన దుయ్యబట్టారు. ఈనెల 22 తర్వాత ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సైరన్ ఇస్తామని ప్రకటించడాన్ని వాయిదా వేసుకోవాలని ఆయన హితవు పలికారు. మరో 10 రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని, ఈ సమయంలో కేబినెట్ సమావేశం పేరుతో చంద్రబాబు ఎందకు హడావుడి చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రం దివాలా తీయడానికి చంద్రబాబు అనుసరించిన ఆర్థిక విధానలే కారణమన్నారు. వ్యవస్థలను వాడుకోవడం, తరువాత వదిలేయడంలో ఆయన దిట్టఅని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో దాదాపు మూడున్నర లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన వెల్లడించారు. బిల్లులకు సంబంధించి అన్నీ చంద్రబాబు అనుచరులకు నిధులను కట్టబెట్టడానికి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మే 23 తర్వాత వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని, పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారని ఆయన స్పష్టం చేశారు. కార్మికుల డిమాండ్లు అన్నీ పరిష్కరించడానికి వైఎస్ జగన్మోహనరెడ్డి కృషి చేస్తారని ఆయన తెలిపారు. భవిష్యత్‌లో అప్పులు దొరక కూడదని చట్ట పరిధిలోనే కాకుండా ఇష్టమొచ్చినట్లు చంద్రబాబు వ్యవహరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘కోడ్’ ఉల్లంఘనలు పాల్పడడం, సమావేశాలు పెట్టడం వంటివి చేయలేదని ఆయన గుర్తుచేశారు.