రాష్ట్రీయం

మోదమ్మ జాతర ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, మే 12: అన్ని వర్గాల ఇంట ఇలవేల్పుగా కొలవబడుతున్న విశాఖ జిల్లాలోని పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక శాసనసభ్యురాలు, ఆలయ కమిటీ చైర్మన్ గిడ్డి ఈశ్వరి ఉత్సవాలను శాస్రోక్తంగా ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఈఏడాది అధికార యంత్రాంగం ఉత్సవాలకు దూరంగా ఉంది. అధికారులు లేకుండా మోదమ్మ జాతరను ప్రజాప్రతినిధులు, పట్టణ వాసులు వైభవంగా ప్రారంభించాల్సి వచ్చింది. ఇటీవల ఆంధ్రా-ఒడిశా ప్రాంతాల్లో మావోయిస్టుల అలజడులు జరుగుతున్న నేపథ్యంలో అమ్మవారి జాతరకు భారీయెత్తున పోలీసు బలగాలను మోహరించారు. అంతకుముందు మోదకొండమ్మ ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి, పాదాలు, ఘటాలకు వేద మంత్రోచ్ఛరణలతో పూజలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పాదాలను గోవింద్ మాస్టార్, ఘటాలను ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బూరెడ్డి నాగేశ్వరరావు తమ శిరస్సులపై ఉంచుకుని ఆలయం నుంచి వెలుపలకు తీసుకువచ్చారు. దీంతో బయట వేచి ఉన్న వందలాది మంది భక్తులు వీటిని తమ తమ శిరస్సులపై ఉంచుకునేందుకు పోటీ పడ్డారు. ఆలయం వద్ద తోపులాట చోటుచేసుకున్నా పోలీసులు అదుపు చేశారు. ఘటాల ఊరేగింపు పట్టణ పురవీధుల గుండా కొనసాగి మెయిన్‌రోడ్డులో ఏర్పాటు చేసిన సతకంపట్టు వద్ద ప్రతిష్టించారు. మూడు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా సతకంపట్టులో ప్రతిష్టించిన మోదకొండమ్మ ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాలకు మరోసారి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల దర్శనానికి అవకాశం కల్పించారు. ముగింపు రోజైన మంగళవారం అనుపు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సతకంపట్టులో ఆదివారం ప్రతిష్టించిన అమ్మవారి ఉత్సవ విగ్రహాం, పాదాలు, ఘటాలను మంగళవారం సాయంత్రం సతకంపట్టు నుంచి వేలాది భక్తజనం నడుమ పట్టణంలో ఊరేగించి రాత్రి ఎనిమిది గంటల సమయానికి తిరిగి మోదకొండమ్మ ఆలయానికి చేర్చడంతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఉత్సవాల్లో విషాదం
పాడేరులో మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలను తిలకించేందుకు వస్తున్న దంపతులు ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా, ఆమె భర్త గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన మహిళ గర్భిణీ కావడం పలువురిని తీవ్రంగా కలిచివేసింది.
పాడేరు పట్టణంలోని గుడివాడ వీధిలో నివాసం ఉంటున్న శ్రీశైలపు బ్రహ్మాజి మొదటి కుమారుడు అయ్యప్పకు ఇటీవల యలమంచలికి చెందిన నాగ రమ్య అనే యువతితో వివాహం చేశారు. నవ దంపతులు విజయనగరంలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదివారం నుంచి పాడేరులో జరుగుతున్న మోదకొండమ్మ అమ్మవారి జాతరను రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పాడేరు నుంచి చోడవరం వైపు వెళుతున్న పాడేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న మోటార్ బైకు బలంగా ఢీకొనడంతో దంపతులిద్దరూ కిందకు పడిపోయారు. ఈ ప్రమాదంలో నాగరమ్య శరీర భాగాల నుంచి బస్సు చక్రాలు వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందినట్టు తెలుస్తోంది. అయితే ఆమె భర్త అయ్యప్ప మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారు. సంఘటనపై మృతిరాలి మామ బ్రహ్మాజి పాడేరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం... పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలను ప్రారంభించిన సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తమ శిరస్సుపై ఉంచుకుని ఆలయం నుంచి వెలుపలకు తీసుకువస్తున్న స్థానిక శాసనసభ్యురాలు,
ఆలయ కమిటీ చైర్మన్ గిడ్డి ఈశ్వరి