రాష్ట్రీయం

బాబు పర్యటనలపై గోప్యం ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఐదేళ్లల్లో పర్యటించిన విమానం అద్దెలు, దొంగ చెల్లింపులు జీవోలన్నింటినీ గోప్యం గా ఎందుకు ఉంచాల్సి వచ్చిందో చెప్పాలని వైకా పా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాం డ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాకు విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం చంద్రబాబు ప్రభుత్వం పోర్టల్‌లో పెట్టని రహస్య జీవోలన్నింటిపైనా గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఆయన సూచించారు. మే 23 లోపే చంద్రబాబు ఖర్చు చేసిన వివరాలను బయటపెట్టాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని డిమండ్ చేశారు. టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అజ్ఞాతంలో దాక్కున్నా చట్టాల నుంచి తప్పించుకోలేరన్నారు. టీవీ 9 వాటాల వ్యవహారంలో సొంత లబ్ధి కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతో పాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ అభియోగాలతో రవిప్రకాశ్ పాటు నటుడు శివాజీపై కేసులు నమోదు చేశారన్నారు. పోలీసుల ఎదుట హాజరు కావాలని సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేస్తే ఎందకు హాజరు కాలేదన్నారు. మెరుగైన సమాజ ఉద్యమకారుడు గత రెండు రోజుల నుంచి కనపడడంలేదని పోలీసులు గాలిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. విజయవాడలో ఉన్నా పోలీసులు పట్టకుంటారని తెలిసి బెంగుళూరు మీదుగా ముంబయి చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. రవిప్రకాశ్ ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసుకుని ఎందుకు ఉన్నారు అంటూ నిలదీశారు. వరుస కరువులతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు చేసిన మోసాలను బయటపెడతామని ఆయన హెచ్చరించారు. జిల్లాలో కరువును పారదోలడానికి రెయిన్‌గన్ల స్టోరీలు, నీటి గలగలలు,కియా కార్ల ఫ్యాక్టరీతో ఇంటికో ఉద్యోగం వచ్చిందని ఎన్నాళ్ళు మోసం చేస్తావు అంటూ ఆయన నిలదీశారు. అనంతపురం జిల్లా దుర్భిక్ష పరిస్థితులు రావడానికి మీరు కాదా అంటూ ఆయన దుయ్యబట్టారు. అక్కడ కరవుతో రైతు కూలీలతో పాటు వేలాదిమంది కుటుంబాలు కర్నాటకకు వలసలు పోతున్నారని ఆయన గుర్తు చేశారు. పశువులు, గొర్రెలు, మేతలేక రైతులు వచ్చినకాడికి అమ్ముకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఏమైందని ఆయన ప్రశ్నించారు. అనుభవం ఉంది కదా.. అందుకే ఆంధ్ర ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టేశావా? అంటూ ధ్వజమెత్తారు. ఆర్టీసీకి రూ.650 కోట్లు నష్టాలు వచ్చాయంటే ఇన్నాళ్లూ చూస్తూ కూర్చున్నావా? అంటూ నిప్పులు చెరిగారు. ఆర్టీసీకి నష్టాలకు మీతో పాటు ఆర్టీసీ ఎండీ సురేందర్ బాబు కూడా బాధ్యులని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బస్సులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ ఎండీ బిజీగా ఉన్నారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.