రాష్ట్రీయం

నేడు టెన్త్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం ఉదయం 11.30 గంటలకు విడుదల చేస్తున్నట్టు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (టీఎస్‌బీఎస్‌ఈ) ప్రకటించింది. సచివాలయంలోని ‘డీ’ బ్లాక్ కాన్ఫరెన్స్ హాలులో ఫలితాల విడుదల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్దన్ రెడ్డి, టీఎస్‌బీఎస్‌ఈ కార్యదర్శి విజయకుమార్ వెల్లడించారు. పదో తరగతి ఫలితాల విడుదలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్దన్ రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే పలుమార్లు ఉన్నతస్థాయిలో ఈ అంశంపై సమావేశాలు జరిగాయి. టీఎస్‌బీఎస్‌ఈ కార్యదర్శి విజయకుమార్‌తోపాటు ఇతర అధికారులతో కూడా జనార్దన్ రెడ్డి చర్చించారు. ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో జరిగిన రాద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకుని పదో తరగతి ఫలితాలను రూపొందించడంలో, ఇతరత్రా కోణాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పదో తరగతి పరీక్షలు 2019 మార్చి 16 నుండి ఏప్రిల్ 2 వరకు జరిగాయి. పరీక్షలు పూర్తయిన నలభై రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తున్నారు. ఫలితాల వెల్లడిలో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా చూసేందుకు కొద్దిగా సమయం ఎక్కువ తీసుకున్నట్టు తెలుస్తోంది. జాప్యం జరిగినా ప్రభుత్వంపై విమర్శలు రాకుండా చూడాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నతాధికారులను హెచ్చరించినట్టు తెలిసింది. దాంతో అన్ని కోణాల్లో పరిశీలించి ఎస్‌ఎస్‌సీ ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఐదులక్షల మందికి పైగా విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఫలితాలు విడుదల చేసిన వెంటనే వివిధ వెబ్‌సైట్లలో వివరాలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు.