రాష్ట్రీయం

యాదాద్రిలో 15 నుంచి శ్రీ లక్ష్మీనృసింహ జయంత్యుత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, మే 12: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి ఉత్సవాలను ఈనెల 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు కొండపైన బాల ఆలయంలో, పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఈవో గీత తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో స్వామివారి జయంతి ఉత్సవాల ఏర్పాట్లను గురించి వివరించారు. స్వామివారి జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి పురస్కరించుకుని ఏటా నిర్వహించే జయంతి ఉత్సవాలు బుధవారం 15వ తేదీ ఉదయం 9 గంటలకు స్వస్తీవాచనం, విశ్వక్సేనారాధనతో మొదలవుతాయన్నారు. 10:30 గంటలకు లక్ష పుష్పార్చన, 11:30 లకు తిరు వెంకటపతి అలంకార సేవ, రాత్రి 8:30 గంటలకు గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవ, మహానివేదన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 16న 9:30 గంటలకు లక్ష కుంకుమార్చన, మంగళ నీరాజనం, 11:30కు కాళీయమర్ధన అలంకార సేవ, రాత్రి 8:30కు హనుమంత వాహనం, రామావతార అలంకార సేవ నిర్వహిస్తారు. ఉత్సవాల్లో మూడవ రోజు 17న ఉదయం 7 గంటలకు మహా పూర్ణాహుతి, 7:30కు సహస్ర కలాశాభిషేకం, సాయంత్రం 7గంటలకు మహామంటపంలో తిరువారాధన సేవాకాలం, నృసింహ అవిర్భావ ప్రవచనం, జయంతి ఉత్సవం, నివేదన, తీర్ధప్రసాద వినియోగం, ఉత్సవ పరిసమాప్తి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగిస్తాయి. లక్ష పుష్పార్చన, లక్ష కుంకుమార్చనల్లో పాల్గొనే దంపతులు 1,116 రూపాయలు, సహస్ర కలాశాభిషేకంలో 2వేల రూపాయలు టికెట్ ఉంటుందన్నారు.
స్వామిని దర్శించుకున్న పీవీ సింధు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని ఆదివారం భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. సింధుకు అర్చక బృందం ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందించారు.
చిత్రం... స్వామివారిని దర్శించుకున్న బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు