రాష్ట్రీయం

తిరుమలలో రద్దీ... సేవలపై టీటీడీ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: వేసవి సెలవులు కావడంతో తిరుమలకు శ్రీవారి దర్శనార్థం వస్తున్న భక్తుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ దర్శనం, అన్నప్రసాదాలు, వసతి తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు ఇన్చార్జ్ జేఈఓ లక్ష్మీకాంతం పర్యవేక్షణలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా వీలైనంత త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తున్నారు. తలనీలాలు సమర్పించేందుకు భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి 24 గంటలు సేవలందిస్తున్నారు. తిరుమలలో బస కల్పించేందుకు విశ్రాంతి భవనాలలోని గదుల వివరాలను ఎప్పటికప్పుడు టీటీడీ రేడియో, బ్రాడ్ కాస్టింగ్ ద్వారా భక్తులకు తెలియజేస్తున్నారు. భక్తులకు అవసరమైనన్ని లడ్డూలను అందుబాటులో ఉంచారు. నారాయణగిరి ఉద్యానవనాలలోని సర్వదర్శనం, దివ్యదర్శనం క్యూలైన్లు, వైకుంఠం 1,2 కంపార్టుమెంట్లలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, చిన్న పిల్లలకు పాలను శ్రీవారి సేవకులు ద్వారా నిరంతరం పంపిణీ చేస్తున్నారు. తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్యం కోసం ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. టీటీడీ ఇంజినీరింగ్, నిఘా, భద్రతా సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేసి పటిష్టమైన భద్రత కల్పించడంతోపాటుగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టారు. వేసవి సెలవుల్లో తరలివస్తున్న భక్తులకు సేవలందించేందుకు టీటీడీ అధికారులు, సిబ్బంది, దాదాపు 3500 మంది శ్రీవారి సేవకులు, 500 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ విశేష సేవలందిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో భక్తుల సౌకర్యాలను 70 మంది పిడబ్ల్యుఎఫ్‌ఎస్ సేవకులు పర్యవేక్షిస్తున్నారు. వేసవి సెలవులు, అందులోనూ వారాంతం కావడంతో ఈనెల 11న శనివారం 95,016 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో రికార్డు స్థాయిలో 72,680 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 71వేల మందికి ఉప్మా, 45వేల మందికి సాంబారన్నం, 20,500 మందికి కాఫీ, 77,600 మంది చిన్న పిల్లలకు పాలు, 35వేల మందికి మజ్జిగ అందించారు. అలాగే పీఏసీ 2లో 6200 మందికి అన్నప్రసాదాలు, బయటి క్యూలైన్లలో 32 వేల మందికి ఉప్మా, 15వేల మందికి సాంబారన్నం అందించారు. వైద్య విభాగం ఆధ్వర్యంలో 3,539 మంది భక్తులకు వైద్య సేవలను అందించారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో 1230 మంది సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. 55 ట్రిప్పులతో చెత్తను తరలించారు. కాగా 52,107 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు.
చిత్రాలు.. తిరుమల కొండపై వసతి లేక ఆరుబయటే విశ్రమించిన భక్తులు..
*వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో భక్తులకు అల్పాహారం పంపిణీ చేస్తున్న వలంటీర్లు