రాష్ట్రీయం

ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్ నిధులు సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. గత నెలలో రాష్ట్రంలోని 191 మార్కెటింగ్ కమిటీలకు సంబంధించి పీడీ అకౌంట్లలో ట్రెజరీలలో ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్స్ నిధులు రూ 500 కోట్లకు పైగా జీరో అయ్యాయి. ఈ నిధులను ప్రభుత్వం పసుపు-కుంకుమ చెల్లింపులకు మళ్లించిందని సర్వత్రా ఆరోపణలు వినవచ్చాయి. దీంతో రైతు బంధు పథకం కింద చెల్లింపులతో పాటు పాటు మార్కెటింగ్‌శాఖ ఉద్యోగుల జీతాలు నిలిచిపోయాయి. ఈ విషయమై ఆంధ్రభూమి మెయిన్ ఎడిషన్‌లో సోమవారం వార్తా కధనం ప్రచురితమైంది. పీడీ అకౌంట్ల నిర్వహణకు సంబంధించి సీఎఫ్‌ఎంఎస్ సాంకేతిక లోపాల వల్ల ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్‌లు కనిపించటంలేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ కారణంగా గత నెలరోజులుగా మార్కెట్ యార్డులలో కనీస అవసరాలు, అత్యవసర పనులకు నిధులు డ్రా చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఉన్నపళంగా ట్రెజరీలలో ఓపెనింగ్ బ్యాలెన్స్ నిధులు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైనప్పటికీ అవి డ్రా చేసేందుకు ఉపకరించటం లేదని, రైతుబంధు పథకానికి కూడా చెల్లింపులు జరగటం లేదని మార్కెటింగ్‌శాఖ అధికారి ఒకరు తెలిపారు.