రాష్ట్రీయం

పీజీఈసెట్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్) : ఏపీ పీజీఈసెట్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. పీజీఈసెట్ ఫలితాలను మంగళవారం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు విడుదల చేశారు. ఫలితాల్లో 86.55 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 24,248 మంది అభ్యర్థులకు గాను 20,986 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా బాలికలు 88.49శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు 84.98శాతం ఉత్తీర్ణత సాధించారు. బయోటెక్నాలజీ విభాగంలో పిఎస్ రజిత, కెమికల్ ఇంజనీరింగ్‌లో ఎ వేదాశ్రీ, సివిల్ ఇంజనీరింగ్‌లో మహంతి అంజనీబాయి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో కెహెచ్‌ఎన్ సీతారాగిని, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఎం జ్యోత్స్న, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో టి మహేంద్ర, ఫుడ్ టెక్నాలజీలో పి రవళి, జియో ఇంజనీరింగ్‌లో ఎ రవితేజ, ఇన్‌స్ట్రూమెన్‌టేషన్ ఇంజనీరింగ్‌లో ఎస్‌ఎం సింధూరి, మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఎ సాయిచరణ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో ఎస్ సాయి ప్రకాష్, నానో టెక్నాలజీలో పి మంత్రునాయక్, ఫార్మసీలో పి ఫృద్వీ ప్రథమర్యాంక్ కైవసం చేసుకున్నారు. ఈనెల 20వతేదీ నుండి ర్యాంక్ కార్డులను వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని విజయరాజు పేర్కొన్నారు.