రాష్ట్రీయం

కరుణించిన కర్నాటక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 14: పాలమూరు జిల్లా ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రయత్నం ఫలించింది. తాగునీటి అవసరాల కోసం జూరాల ప్రాజెక్టుకు 2.5 టీఎంసీల నీటి విడుదల చేయాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని కేసీఆర్ కోరారు. ఇందుకు కర్ణాటక ముఖ్యమంత్రి వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి జూరాలకు నీటి విడుదలకు అంగీకరించారు. దాంతో ఈ నెల 10న కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుండి 2.5 టీఎంసీల నీటిని విడుదల చేశారు. దాంతో కృష్ణాజలాలు నది వెంట వచ్చి జూరాలకు మంగళవారం తాకింది. అయితే కృష్ణానది పూర్తిగా ఎండిపోవడంతో నీటి విడుదల చేసినప్పటికీ ఆలస్యంగా జూరాల ప్రాజెక్టుకు నీరు వచ్చి చేరింది. అదే వర్షాకాలంలో అయితే నారాయణపూర్ నుండి జూరాలకు నీరు కేవలం రెండు రోజుల వ్యవధిలో వచ్చి చేరుతుంది. కానీ ప్రస్తుతం ఎండాకాలం కావడం అదేవిధంగా నది పూర్తిగా ఎండిపోవడం నీరు ముందుకు రావడానికి ఆలస్యం అయింది. కాగా జూరాల ప్రాజెక్టుకు నీరు వచ్చి చేరుతుండడంతో ఇక పాలమూరు ప్రజల తాగునీటి ఇబ్బందులు గట్టెక్కినట్టేనని చెప్పకతప్పదు. రామన్‌పాడు, కోయిల్‌సాగర్ తదితర మంచినీటి సరఫరా ప్రాజెక్టులకు జూరాల నుండి నీటిని విడుదల చేసేందుకు అవకాశం లభించనుంది. దాంతో నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలోని వివిధ పట్టణాలకు, పలు గ్రామాలకు మంచినీటి సరఫరాకు మార్గం సుగమంకానుంది. అదేవిధంగా ఎండాకాలంలో నది నుండి నీరు పారుతుండడంతో నది తీర ప్రాంతాలలోని గ్రామాలకు సైతం నీటి సమస్య పరిష్కారం కానుంది. జూరాల ప్రాజెక్టుకు నీరు వచ్చి చేరుతుండడంతో పాలమూరు ప్రజల నీటి కష్టాలు ఎండాకాలంలో తీరినట్టేనని చెప్పకతప్పదు.
చిత్రం...నారాయణపేట జిల్లాలో క్రిష్ణ బ్రిడ్జి దగ్గర జూరాల ప్రాజెక్టులోకి వెళ్తున్న
నారాయణపూర్ ప్రాజెక్టు నుండి వదిలిన కృష్ణాజలాలు