రాష్ట్రీయం

మరో ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో మరొక ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించింది. మల్కాజ్‌గిరి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ జారీ చేసింది. దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 21న జారీ చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదే రోజు నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమై 28 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత 29న నామినేషన్ల పరిశీలన, 31న నామినేషన్ల ఉపసంహరణకు గడువు, జూన్ 7వ తేదీన పోలింగ్, అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరగనుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇలా ఉండగా ఎమ్మెల్యేల కోటా నుంచి మైనంపల్లి హనుమంతరావు గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే శాసనసభ ఎన్నికల్లో ఈయన సికింద్రాబాద్‌లోని మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికకు షెడ్యూల్ జారీ అయింది. మల్కాజ్‌గిరి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు నవీన్‌రావుకు కాకుండా మైనంపల్లికి టికెట్ దక్కింది. ఆ తర్వాత ఇక్కడి నుంచే నవీన్‌రావు పార్లమెంట్ టికెట్ ఆశించి రెండోసారి కూడా భంగపడ్డారు. మంత్రి సిహెచ్ మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి పార్లమెంట్ టికెట్ ప్రకటించిన సందర్భంగా నవీన్‌రావుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించనున్నట్టు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా మైనంపల్లి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్‌రావును టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటించనుంది. ఇలా ఉండగా శాసనసభలో టీఆర్‌ఎస్ పార్టీకి ఉన్న సంఖ్య బలం మేరకు ఇది ఏకగ్రీవం కానుంది.