రాష్ట్రీయం

హైదరాబాద్ యువకుడు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అమెరికాలోని నార్త్ కరోలినాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు. కారు ఢీకొట్టిన ప్రమాదంలో బొంగుల సాహిత్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో ఎంఎస్ చేసేందుకు వెళ్లి ఆ యువకుడు రహదారి ప్రమాదంలో దుర్మరణం చెందాడు. సాహిత్ రెడ్డి తల్లిదండ్రులు మధుసూదన్ రెడ్డి, లక్ష్మీ నల్లకుంట అడిక్‌మెట్ పద్మా కాలనీలో నివాసం ఉంటున్నారు. తమ పెద్ద కుమారుడు మృతి చెందడంతో కుటుంబసభ్యులు తీరని దుఃఖంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ప్రభు త్వం సహకరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన సాహిత్ రెడ్డి కుటుంబసభ్యులను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని పద్మాకాలనీలోని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సాహిత్ రెడ్డి మృతి బాధాకరమని,ఆయన పార్ధీవ దేహాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. మంత్రి వెంట ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్‌ఎస్ నాయకులు, స్థానిక బస్తీవాసులు ఉన్నారు.

*సాహిత్ రెడ్డి (ఫైల్‌ఫొటో)