రాష్ట్రీయం

ఇందూరు ఫలితం ఒక రోజు ఆలస్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: దేశ వ్యాప్తంగా ప్రజలందరి దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మొదటి విడతలోనే గత ఏప్రిల్ 11వ తేదీన ఇందూరు లోక్‌సభ స్థానానికి పోలింగ్ ముగియగా, 23వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశ వ్యాప్తంగా అన్ని పార్లమెంటు సెగ్మెంట్ల ఫలితాలు అదే రోజున దాదాపు మధ్యాహ్న సమయానికే ట్రెండ్ తెలియనుండగా, ఒక్క నిజామాబాద్ ఫలి తం విషయంలో మాత్రం మరుసటి రోజు వరకు సస్పెన్స్ పర్వం కొనసాగనుంది. ఈ నియోజకవర్గం నుండి అనూహ్యంగా 185 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడమే ఫలితాల జాప్యానికి
కారణమవుతోంది. మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటు తదితర డిమాండ్ల సాధన కోసం రైతులు మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల్లో పోటీ చేసిన విషయం విదితమే. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్ తరఫున సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత, బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ తరఫున ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ తలపడ్డారు. వీరిలో ప్రధానంగా తెరాస, బీజేపీల మధ్యనే హోరాహోరీ పోరు కొనసాగినట్టు పోలింగ్ సరళిని బట్టి పరిశీలకులు పేర్కొంటుండడంతో ఇందూరు ఫలితంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. భారీ సంఖ్యలో 185మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఎన్నికల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని దేశంలోనే తొలిసారిగా ఎం-3 రకానికి చెందిన మెగా ఈవీఎంలతో పోలింగ్‌ను జరిపించింది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 చొప్పున బ్యాలెట్ యూనిట్లను వినియోగించారు. మొత్తం మీద అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తోడ్పాటుతో ఓటింగ్ ప్రక్రియను ఈవీఎంలతోనే నిర్వహించడంలో ఈసీ సఫలీకృతం అయినప్పటికీ, ఓట్ల లెక్కింపులో మాత్రం జాప్యం అనివార్యమని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు నోటాను కలుపుకుని బ్యాలెట్ బాక్సుల్లోని మొత్తం 186 బటన్‌లను ప్రతీ రౌండ్‌లో సరి చూస్తూ కౌంటింగ్ జరపాల్సి రావడంతో ఈ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగనుంది. ఏజెంట్ల సమక్షంలో వారి అనుమానాలను నివృత్తి చేస్తూ పారదర్శకంగా కౌంటింగ్ జరిపేందుకు ఒక్కో రౌండ్‌కు కనీసం రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 18 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ ఒక రోజు ఆలస్యంగా మే 24వ తేదీన ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల ఓట్లను నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని సీఎంసీ కళాశాల కౌంటింగ్ కేంద్రంలో లెక్కించనుండగా, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల ఓట్లను జగిత్యాల జిల్లా కేంద్రంలో లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు తేదీకి మరో వారం రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండడంతో జిల్లా యంత్రాంగం తుది ఏర్పాట్లను ముమ్మరం చేసింది. గంటల తరబడి ఏకబిగిన కొనసాగనున్న ఓట్ల లెక్కింపు కోసం షిఫ్టుల వారీగా సిబ్బందిని నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. బుధవారం కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావుతన చాంబర్‌లో జిల్లా అధికారులతో సమావేశమై కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీగా ఓట్ల లెక్కింపు జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి స్వయంగా ఓట్ల లెక్కింపు జరిగే సీఎంసీ కళాశాలను సందర్శించి, క్షేత్రస్థాయిలో కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేశారు.