రాష్ట్రీయం

జూన్ రెండో వారంలో అసెంబ్లీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: ఈ నెలలో శాసనసభ ప్రత్యేక సమావేశం లేనట్టేనని అధికార వర్గాల సమాచారం. పార్లమెంట్, పరిషత్, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతనే వచ్చే నెల రెండో వారంలో సమావేశాలు ఉండే అవకాశం ఉంటాయని తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడే దాకా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. అలాగే పరిషత్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 27న వెలువడనున్నాయి. ఆ తర్వాత 31న స్థానిక సంస్థల కోటాలో జరిగే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినం, జూన్ 3న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఎమ్మెల్యే కోటాలో జరుగనున్న ఎమ్మెల్సీకి జూన్ 7న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ (ఏకగ్రీవం కాని పక్షంలో) జరుగనుంది. ఈ కారణాలన్నింటి దృష్ట్యా జూన్ మొదటి వారం వరకు శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం లేదని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రెవిన్యూ, మున్సిపల్ చట్టాల సవరణకు ఈ నెల మూడవ వారంలోనే శాసనసభ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే వరుసగా పార్లమెంట్, పరిషత్, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కారణంగా జూన్ రెండో వారంలోనే శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.