రాష్ట్రీయం

కనీస మట్టానికి చేరువలో సాగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, మే 15: నాగార్జునసాగర్ జలాశయం కనీస నీటి మట్టానికి అతి చేరువలో ఉంది. సాగర్ జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా కనీస నీటి మట్టం 510 అడుగులు. ప్రస్తుతం కనీస నీటి మట్టానికి ఒకే ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఇప్పటికే సాగర్ కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదలని పూర్తిగా నిలిపివేసారు. సాగర్ ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయం పరిస్థితి కూడా ఇలానే ఉంది. సాగర్ జలాశయానికి ఎగువ నుండి 1581 క్యూసెక్కుల నీరు చేరుకుంటుంది.
ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 900 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 511 అడుగులుగా నీటి మట్టం ఉంది.

చిత్రం... 511 అడుగులుగా సాగర్ జలమట్టం