రాష్ట్రీయం

పక్షపాతం..అప్రజాస్వామికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: పక్షపాతంతో, అప్రజాస్వామికంగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందంటూ కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు గురువారం ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఘాటైన లేఖ రాశారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించేందుకు నిర్ణయించడంపై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఆ నియోజకవర్గంలో నకిలీ దరఖాస్తులతో ఓటర్ల జాబితాలో పేర్లు తొలగింపునకు వైకాపా వర్గాలు ప్రయత్నించడంపై చాలా ఫిర్యాదులు వచ్చాయని గుర్తు చేశారు. టీడీపీ కార్యకర్తల పేర్లను ఓటర్ల జాబితాలో ఎక్కువ సంఖ్యలో తొలగించారని తెలిపారు. నకిలీ దరఖాస్తులతో ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించామని, నకిలీ దరఖాస్తులకు ఉపయోగించిన కంప్యూటర్ల ఐపీ అడ్రస్‌లను ఎన్నికల సంఘం ఇంకా ఇవ్వకపోవడం తనను షాక్ గురి చేస్తోందని తెలిపారు. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులను ఈసీ బుట్టదాఖలు చేస్తోందని, కానీ వైకాపా ఇచ్చిన ఫిర్యాదులపైనే చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాలు 166, 172, 173, 192, 193, 194, 310, 311, 323లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదు చేశామని, దీనిపై దర్యాప్తు నిర్వహించి రీపోలింగ్ నిర్వహించాల్సి ఉందని గుర్తు చేశారు. ఫలితాలు వెలువరించిన తరువాత కూడా రీపోలింగ్ నిర్వహిస్తుందా అని ప్రశ్నించారు. నిబంధనలను ఉల్లంఘించి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోందన్నారు. బీజేపీ, దాని మిత్రపక్షాల ఫిర్యాదులపై మెరుపువేగంతో స్పందిస్తున్న ఈసీ మిగిలిన పక్షాల ఫిర్యాదులపై నత్తనడకన స్పందిస్తోందని మండిపడ్డారు. బెంగాల్‌లో ఏకపక్షంగా ఎన్నికల ప్రచారాన్ని నిషేధించడం సరికాదన్నారు. నిష్పాక్షికంగా విచారణ జరపాల్సి ఉందని, బీజేపీ చెప్పుచేతుల్లో ఎన్నికల కమిషన్ పని చేయడం ప్రమాదకర పోకడగా వ్యాఖ్యానించారు. 50 శాతం వీవీప్యాట్‌ల లెక్కింపు డిమాండ్‌ను మరోసారి పరిశీలించాలని కోరారు.