రాష్ట్రీయం

మరి కొన్నిచోట్ల రీ-పోలింగ్ జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో మరికొన్ని చోట్ల రీ-పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గతంలో రీ-పోలింగ్ నిర్వహించాలని కోరుతూ ఇచ్చిన వినతులపై తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (ఇన్‌చార్జి) సుజాతా శర్మను టీడీపీ నేతలు మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీలు అశోక్ బాబు, డొక్కా మాణిక్యవరప్రసాద్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి లంకా దినకర్ తదితరులు కలిసి గురువారం వినతిపత్రాన్ని అందచేశారు. గత 11న, ఆ తరువాత నరసరావుపేట, రాజంపేట, కోడూరు, సత్యవేడు, జమ్మలమడుగు, సత్తెనపల్లి, చంద్రగిరి నియోజకవర్గాల పరిధిలో కొన్ని చోట్ల రీ-పోలింగ్ నిర్వహించాలని, కారణాలను కూడా వివరిస్తూ గతంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. దీనిపై ఏమి చర్యలు తీసుకున్నారో తెలియచేయలేదని ఆరోపించారు. నర్సారావుపేట నియోజకవర్గ పరిధిలో 214, 215 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ ఏజెంట్లపై కొంతమంది దాడి చేసి, వారిని బయటకు పంపేశారని తెలిపారు. ఆ తరువాత వైకాపా వ్యక్తులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. రాజంపేట నియోజకవర్గ పరిధిలో 78, 130, 131, 132 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ ఏజెంట్లపై దాడి చేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, ఎస్సీ, బీసీ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని వివరించారు. కోడూరు నియోజకవర్గ పరిధిలో 21, 244 పోలింగ్ కేంద్రాల్లో, సత్యవేడు నియోజకవర్గ పరిధిలో 80, 81 పోలింగ్ కేంద్రాల్లో, జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో 287, 288 పోలింగ్ కేంద్రాల్లో, చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో 310, 311, 323 పోలింగ్ కేంద్రాల్లో తమ ఏజెంట్లపై దాడి చేసి, రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు కూడా చేశామని వివరించారు. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో 160, 161, 162 పోలింగ్ కేంద్రాల వద్ద తమ పార్టీ అభ్యర్థిపై దాడి చేశారని, ఏజెంట్లపై కూడా దాడి చేశారని తెలిపారు. గతంలో తాము చేసిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని, ఆయా నియోజకవర్గ రికార్డులను పరిశీలించి రీ-పోలింగ్‌కు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ రోజున వైకాపా నేతలు ఫిర్యాదు చేస్తే స్పందించారని, తమ ఫిర్యాదును బుట్టదాఖలు చేశారని ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ వ్యవహారంలో ఈసీ విశ్వసనీయత ఏమిటో అందరికీ తెలిసిందని మండిపడ్డారు. వైకాపా నేతలు చేసిన ప్రతి ఫిర్యాదుపైనా సత్వరమే చర్యలు తీసుకుంటూ, పోలింగ్ రోజు వైకాపా చేసిన దాడులపై టీడీపీ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రారంభానికి ముందే జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను బదిలీ చేయడంతో ఎన్నికల సంఘం పనితీరుపై మొదట్లోనే నమ్మకం పోయిందన్నారు. అయినప్పటికీ, ప్రతి విషయంపై ఫిర్యాదు చేశామని, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు టీడీపీ తమ వంతుగా ప్రయత్నిస్తోందన్నారు. ఏపీలో ఎన్నడూ ఇలా రీపోలింగ్ జరిగగిన దాఖలాలు లేవన్నారు. కోడ్ అమల్లో ఉన్న సమయంలో సీఈవో ద్వివేది సెలవుపై వెళ్లడం కూడా అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. రెండోసారి రీ-పోలింగ్‌పై అవసరమైతే కోర్టుకు వెళ్తామన్నారు
చిత్రం... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (ఇన్‌చార్జి) సుజాతాశర్మకు వినతి పత్రం ఇస్తున్న టీడీపీ నేతలు