రాష్ట్రీయం

ఐటీలో బంగారమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: సరిగ్గా రెండున్నరదశాబ్థాల క్రితం మాదాపూర్‌లో ప్రారంభమైన ఐటీ రంగం త్వరలో హైదరాబాద్‌కు తూర్పున ఉన్న వరంగల్ హైవేకు విస్తరించనుంది. హైదరాబాద్ రూపురేఖలు మార్చి సైబరాబాద్‌గా అవతరించి అంతర్జాతీయంగా భాగ్యనగరం కీర్తిపతాకాన్ని ఎగరవేసిన ఐటీ కారిడార్ విస్తరిస్తోంది. దేశంలో బెంగళూరు తర్వాత ఐటీ రంగానికి హైదరాబాద్ దిక్సూచిగా మారింది. తెలంగాణ రాష్ట్రం అవతరించి ఐదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఐటీ రంగం ఎగుమతులు రెట్టింపై రూ.1.09 లక్షల కోట్లకు చేరుకోవడం బంగారు తెలంగాణ సాధన దిశలో కేసీఆర్ సర్కార్ అడుగువేసింది. లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా వరంగల్ హైవే వైపు వడివడిగా ఐటీ రంగం పయనించనుంది.
మాదాపూర్, కొండాపూర్, గచ్ఛిబౌలీలోనే కేంద్రీకృతమైన హైటెక్ సిటీని వరంగల్ జాతీయ రహదారిపై శరవేగంగా అభివృద్థి చెందిన ఉప్పల్, ఘటకేసర్, భవనగిరి వైపుకు కూడావిస్తరించేందుకు కేసీఆర్ సర్కార్ ప్రణాళికలను రూపొందించింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వచ్చే రెండు నెలల్లో కొత్త ఐటీ కారిడార్‌కు రాష్ట్రప్రభుత్వం అంకురార్పణ చేయనుంది. ఈ మేరకు ఒక ముసాయిదాను తయారు చేస్తున్నారు. కొత్త ప్రాంతంలో స్థాపించనున్న ఐటీ కంపెనీలకు 24 శాతం విద్యుత్ సబ్సిడీని, మూడేళ్ల పాటు సాలీనా రూ.25 లక్షల సబ్సిడీని ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మూడేళ్లపాటు ఇంటర్నెట్ సేవలను అందించనున్నారు.
ఇప్పటికే వరంగల్ హైవేపైన జెన్‌పాక్ట్, ఇన్ఫోసిస్, రహేజా ఐటీ సంస్థలను ఏర్పాటు చేశారు. నాగోలు వరకు మెట్రో రైలుతో అనుసంధానం చేశారు. పైగా ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులోకివచ్చింది. త్వరలో రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. ఉప్పల్‌నుంచి పారిశ్రామికవడను నగర శివార్లకు తరలించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఉప్పల్, ఘటకేసర్ మధ్య పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండడం, హెచ్‌ఎండీఏ వీటిని క్రమపద్ధతి ప్రకారం అభివృద్ధి చేయడంతో ఐటీ కారిడార్ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయి.
ఐటీ రంగం హైదరాబాద్‌లో కొత్త పుంతలు తొక్కుతోంది. 2018-19 సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఐటీ రంగం ఎగుమతుల్లో 17 శాతం వృద్ధిరేటును సాధించారు. 2019-20 సంవత్సరానికి రూ.1.30 లక్షల కోట్ల ఎగుమతులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది రూ.1.09 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు చేశారు. ఐటీ రంగం మొత్తం మాదాపూర్, గచ్ఛిబౌలీ వద్ద కేంద్రీకృతం కావడం వల్ల ట్రాఫిక్, కాలుష్య సమస్యలు పెరుగుతున్నాయి. పైగా భవిష్యత్తును దృష్టిని పెట్టుకుని ఐటీ కారిడార్‌ను వరంగల్ హైవేకు విస్తరించడం మంచి నిర్ణయమని ఐటీశాఖ అధికారులు చెప్పారు. 15శాతం వృద్ధిరేటుతో 2017-18లో రూ.93400 కోట్లు, 2016-17లో రూ.85,474 కోట్ల ఎగుమతులు చేశారు. అలాగే 2018-19లో ఉద్యోగాల కల్పన రేటు 14.2 శాతం నమోదైంది. దాదాపు 5,43,033 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. 2014-15లో 52,258 కోట్ల మేర ఎగుమతులు నమోదయ్యాయి. ఐటీ రంగం మొదటి నుంచి సాలీనా 15 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తోంది. డాటా సైనె్సస్, క్లౌడ్, స్టార్టప్‌లు ఆర్ట్ఫిషీయల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాల్లో కొత్త ఐటీ కంపెనీలు వస్తున్నాయి. లుక్ ఈస్ట్‌పాలసీలో భాగంగా ఐటీ రంగం వరంగల్ హైవే పరిసరాల్లో విస్తరించడం వల్ల వచ్చే ఐదు నుంచి పదేళ్లలో కొత్త హైటెక్ సిటీ నగరం ఇక్కడ అవతరించనుంది. దీని వల్ల రియాల్టీ రంగం ఊపందుకుంటుంది.