రాష్ట్రీయం

ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), మే 16: ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు గురువారం తెలిపారు. ముందుగా ప్రకటించినట్లుగా ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయడం లేదని, విడుదల తేదీని మరల ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ఇంటర్మీడియేట్ రీవాల్యుయేషన్, రీవేరిఫికేషన్ ఫలితాలను ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈనెల 27వ తేదీ విడుదల చేస్తున్నారని, ఏపీ ఎంసెట్‌ను తెలంగాణ విద్యార్థులు ఎక్కువ మంది రాయడంతో ఫలితాల విడుదల తేదీని మార్పు చేస్తున్నట్లు ప్రొఫెసర్ విజయరాజు పేర్కొన్నారు.
డీసెట్‌కు 80.7 శాతం హాజరు నమోదు
రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిర్వహించిన డీసెట్ ఆన్‌లైన్ పరీక్షకు 7,004 మంది హాజరయ్యారని డీసెట్ కన్వీనర్ పీ పార్వతి తెలిపారు. ఉదయం 22 సెంటర్లలో 5661 మంది అభ్యర్థులకు గాను 4552 మంది, మధ్యాహ్నం 16 సెంటర్లలో 3006 మంది అభ్యర్థులకు గాను 2452 మంది హాజరయ్యారన్నారు. బుధవారం, గురువారం జరిగిన ఆన్‌లైన్ పరీక్షలకు మొత్తం 23,215 మందికి గాను 18, 726 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 80.7 శాతం హాజరు నమోదైనట్లు తెలిపారు. వెబ్‌సైట్ నుండి అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్‌లు, ప్రశ్నపత్రాన్ని, కీ ని డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు.
ఎల్‌పీసెట్ పరీక్ష ఫీజుకు 18వ తేదీ ఆఖరు
రాష్ట్రంలోని తెలుగు, హిందీ పండిట్ ట్రైనింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎల్‌పీసెట్ 2019 ఆన్‌లైన్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు 18వ తేదీ చివరి తేదీ అని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 19వ తేదీ అని ఎల్‌పీసెట్ కన్వీనర్ పీ పార్వతి తెలిపారు.