రాష్ట్రీయం

బహుపరాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: వచ్చే ఐదు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తీవ్రమైన వడగాడ్పులు రాష్ట్రంలో వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్టమ్రంతా పొడి వాతావరణం నెలకొని ఉంది. ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వేడి గాలుల తీవ్రత అధికంగా ఉంటుంది. తెలంగాణ జిల్లాలంతా ఇదే పరిస్థితి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉంది. శుక్రవారం రాష్ట్రంలో రామగుండంలో 44 డిగ్రీలు, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండలో 43, నిజామాబాద్‌లో 43 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్, ఖమ్మం, భద్రాచలంలో 42 డిగ్రీలు, హన్మకొండలో 41, హకీంపేట, దుండిగల్‌లో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్రమైన వడగాడ్పులతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రోడ్లు నిర్మానుష్యంగా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజిమెంట్ వడగాడ్పుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరింది. వృద్ధులు, పిల్లలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉన్నందున ఎండలో తిరగరాదని హెచ్చరించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మూడు గంటల పాటు బయటకు ప్రజలు రాకుండా ఉండాలని కోరింది. ప్రజలు టోపీలు ధరించాలని లేదంటే గొడుగుతో బయటకు వెళ్లాలి. ప్రజలు ఇళ్లలో ఓఆర్‌ఎస్, నిమ్మరసం, మజ్జిగను అందుబాటులో ఉంచుకోవాలి. ఇంట్లోకి వడగాడ్పులు రాకుండా కిటికీలు మూసివేసి గుడ్డలు కట్టి నీటితో తడుపుతుండాలి. ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే వేడిగాలులు ఉంటాయి. 45 డిగ్రీలు దాటితే తీవ్ర వేడిగాలులు, 47 డిగ్రీలకు చేరితే అతి తీవ్ర వడగాడ్పులు ఉంటాయి. కాగా పారిశ్రామిక కాలుష్యానికి చెందిన సమస్యలు ఉన్నట్లయితే తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి టోల్‌ఫ్రీ నంబర్ 10741కు ఫోన్ చేయాలని మండలి ప్రకటనలో ప్రజలనుకోరింది.