రాష్ట్రీయం

మూడు ఎమ్మెల్సీలకు 9 మంది అభ్యర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో జరుగనున్న మూడు ఎమ్మెల్సీలకు బరిలో తొమ్మిది మంది అభ్యర్థులు నిలిచారు. వీటిక దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన అనంతరం అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శుక్రవారం ప్రకటించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి టీఆర్‌ఎస్ నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఇద్దరే అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి లక్ష్మి, టీఆర్‌ఎస్ నుంచి తేరా చిన్నపరెడ్డి బరిలో నిలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్ నుంచి ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, అన్నారపు యాకయ్య, తక్కెళ్లపల్లి రవీందర్, రంగరాజు రవీందర్ బరిలో నిలిచినట్టు ఎన్నికల కమిషన్ పేర్కొంది. రంగారెడ్డి, నల్లగొండ స్థానాలకు ముఖాముఖి పోటీ జరుగుతుండగా, వరంగల్ జిల్లాలో మాత్రం ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు.