రాష్ట్రీయం

ప్రతి గ్రామానికీ విద్యా రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రతి గ్రామానికీ ఒక విద్యా రికార్డును నమోదు చేయడం ద్వారా ఆయా గ్రామాల్లో బడిబయటి పిల్లల సంఖ్య, చదువుకునే వారు, స్కూలుకు వస్తున్న వారు, స్కూలుకు రాని వారు పేర్లతో సహా రికార్డు చేసి ఎప్పటికపుడు పర్యవేక్షించడానికి పాఠశాల విద్య సన్నద్ధమవుతోంది. ప్రతి గ్రామానికీ విద్యా రిజిస్టర్ రూపొందిస్తారు. సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు వయస్సు పూర్తి చేసుకున్న పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారు. తక్కువ ఎన్‌రోల్‌మెంట్ ఉన్న పాఠశాలలను గుర్తించి విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తారు.
అన్ని ఆవాస ప్రాంతాల్లో ఇంటింటీ సర్వే నిర్వహించడం, ర్యాలీలు నిర్వహించడం, కరపత్రాలను పంచడం, బడిఈడు పిల్లలను గుర్తించి బడిలో నమోదు చేయడం బడిబాటలో భాగంగా చేపడతారు. వచ్చే నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకూ బడిబాటను నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆలాస ప్రాంతాల్లో బడిబాట ప్రాధాన్యతను గుర్తించే విధంగా పాఠశాలలను ఆకర్షణీయంగా అలంకరించుకోవాలని, ర్యాలీలు నిర్వహించాలని పాఠశాల విద్య కమిషనర్ విజయకుమార్ హెడ్మాస్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించి గుణాత్మక విద్యాసాధనకు చేస్తున్న కార్యక్రమాలు, విధానాలు, సౌకర్యాలను తెలియజేయాలని అన్నారు. పాఠశాల విద్య కమిటీ, ఉపాధ్యాయ బృందం కలిసి పాఠశాల అభివృద్ధికై వార్షిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి, పాఠశాల యాజమాన్య కమిటీ నిపుణులు , గ్రామ పెద్దలు, స్వచ్చంద సంస్థలు, పూర్వ విద్యార్థులు, సమాజ సహకారంతో పాఠశాల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలి, పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడం, నాణ్యమైన విద్యను అందించడం, విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు కూడా తీర్మానాలు చేసుకోవాలి. జూన్ 7న బాలిక విద్యకు, 10వ తేదీన సామూహిక అక్షరాభ్యాసానికి ఏర్పాట్లు చేసుకోవాలి. 11వ తేదీన స్వచ్ఛ పాఠశాల కార్యక్రమానికి హరితహారం నిర్వహించడం, 12వ తేదీన బాల కార్మికుల విముక్తికి పాఠశాల యాజమాన్య కమిటీ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి పాఠశాల హెడ్మాస్టర్ , పాఠశాల యాజమాన్య కమిటీ వెంటనే ఒక సమావేశాన్ని నిర్వహించి పాఠశాలలో టెన్త్ ఫలితాలు, ఏడో తరగతి ఫలితాలు, బాలికలకు ఉచితంగా హెల్త్ హైజీన్ కిట్లు పంపిణీ, వౌలిక వసతుల వివరాలు, మధ్యాహ్న భోజన పథకం వివరాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత యూనిఫారాలు, ఎస్సీ, ఎస్టీ స్కాలర్‌షిప్ వివరాలతో పాఠశాలకు ఒక ప్రొఫైల్ రూపొందించుకోవాలి. అలాంటి వివరాలను కరపత్రాలు, బ్యానర్ల ద్వారా పాఠశాల పరిధిలో అందరికీ తెలిసేలా ప్రచారం చేసుకోవాలి.