రాష్ట్రీయం

ప్రలోభాలకు అవకాశం ఇవ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: మండల, జిల్లా పరిషత్ చైర్మన్లకు ఎన్నిక ప్రక్రియను ఫలితాలు వెలువడిన వెంటనే నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డిని కలిసి కోరారు. ఈ మేరకు వారు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ ఫలితాలు వెలువడిన 40 రోజుల తర్వాత పరిషత్ చైర్మన్లకు ఎన్నికలు నిర్వహించడం వల్ల గెలిచిన అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఫలితాలు వచ్చిన మూడు రోజుల్లోగా చైర్మన్ల ఎంపిక జరిగే విధంగా చూడాలన్నారవు. నల్లధనం, పోలీసులను ఉపయోగించి అధికార పార్టీ నేతలు తమ పార్టీలోకి గెలిచిన అభ్యర్థులను చేర్చుకునేందుకు అవకాశం ఉందన్నారు. అప్రజాస్వామిక పద్ధతులకు తావిచ్చే విధంగా ఎన్నికల ప్రక్రియ ఉండరాదన్నారు.
మే 27వ తేదీన కౌంటింగ్ చేసి మూడు రోజుల్లో చైర్మన్ల ఎంపిక చేయాలన్నారు. కావాలంటే జూలై 5వ తేదీన ఎన్నికైన చైర్మన్లు బాధ్యతలు స్వీకరించే విధంగా చేయవచ్చన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ చట్టాల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గౌరవం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, చైర్మన్ల ఎంపిక పారదర్శకంగా జరిగే విధంగా చూడాలన్నారు. ఫలితాల తర్వాత చైర్మన్ల ఎంపికకు ఎక్కువ సమయం ఇవ్వరాదన్నారు. దీని వల్ల538 ఎంపీపీలు, 28 జడ్పీ చైర్మన్లను టీఆర్‌ఎస్ గెలిచే అవకాశం ఉందన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, గత ఏడాది అసెంబ్లీ రద్దయినప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమలులో ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రభుత్వం హత్య చేస్తోందన్నారు. పరిషత్ చైర్మన్ల ఎన్నికలు సాఫీగా జరగాలంటే వెంటనే నిర్వహించాలన్నారు. ఏ మాత్రం జాప్యం చేసినా బేరసారాలకు అవకాశం ఇచ్చినట్లవుతుందన్నారు. 40రోజుల పాటు పరిషత్ ఎన్నికలు జరగకుండా ఉండడం వల్ల అవకతవకలు, అభ్యర్థుల కొనుగోలుకు అవకాశం ఇచ్చినట్లవుతుందన్నారు.టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని, ప్రజాస్వామ్యం బలహీనపడుతోందన్నారు. ఎన్నికల సంఘం కమిషనర్‌ను కలిసిన వారిలో కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోదండరెడ్డి, నిరంజన్, సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డి, న్యూ డెమాక్రసీ గోవర్దన్, తెలంగాణ జన సమితి ప్రతినిధి పీఎల్ విశే్వశ్వరరావు తదితరులు ఉన్నారు.
చిత్రం...ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డిని కలిసిన తరువాత విలేఖరులతో మాట్లాడుతున్న పీసీసీ
అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. టీడీపీ నేత రమణ, కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ