రాష్ట్రీయం

ఏ పార్టీ నుంచి ఆహ్వానం రాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: కేంద్రంలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటుపై తమకు ఏ పార్టీ నుంచి ఆహ్వానం రాలేదని, 23వ తేదీ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుంటామని వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని, వైకాపా గెలుస్తుందని, 23వ తేదీన ఫలితాల తర్వాత జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు పాత్ర ఏమిటో బట్టబయలు అవుతుందని ఆయన అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌కు అనుమతిస్తే చంద్రబాబు విచారం దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం దేనికని ఆయన ప్రశ్నించారు. ఏడు కేంద్రాల్లో రీపోలింగ్‌ను కోరితే ఈసీ ఐదు కేంద్రాల్లోనే నిర్వహిస్తున్నట్లు చెప్పరు ఈ ప్రాంతాల్లో దళితులు ఓటు హక్కును వినియోగించుకోకుండా అగ్రవర్ణాలు అడ్డుపడ్డాయని తమ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి ఫిర్యాదు చేశారన్నారు. రీపోలింగ్ అప్రజాస్వామికం అంటే ఎన్నికల వ్యవస్థంటే చంద్రబాబుకు నమ్మకం లేదా అని అడిగారు. ఈ రోజున రీ పోలింగ్ జరగడం వవల్ల దళితులు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం వస్తే చంద్రబాబు సంతోషించాలన్నారు. ఐదు బూత్‌లలో రీ పోలింగ్ జరిగితే టీడీపీ సర్వనాశనమవుతుందా అన్నాలరు. గుంటూరుజిల్లాలో కూడా రీపోలింగ్ చేశారని, దశల వారీగా రీ పోలింగ్ నిర్వహించారన్నారు. టీడీపీ నేతలకు రీపోలింగ్, ఈవీఎంలు, ఈసీ మీద విశ్వాసం లేదన్నారు. రీపోలింగ్ మీద ఉన్న అభ్యంతరాలు వెల్లడించాలని ఆయన టీడీపీ నేతలను కోరారు.