రాష్ట్రీయం

సిరుల తల్లికి వసంతోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి పట్టపుదేవి, శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. లోకమాతైన శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగిపోతాయి. వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్ర నామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుంచి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. 2.30 నుంచి 4.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పంచామృతాలు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకించారు. సాయంత్రం 6.30 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ధార్మిక సంగీత కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు.
చిత్రం...తిరుచానూరులో వంతోత్సవాల్లో భాగంగా పద్మావతీ అమ్మవారికి పాలు, తేనె తదితర
సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం చేస్తున్న అర్చకస్వాములు