రాష్ట్రీయం

ఆంధ్రప్రదేశ్‌లో సైకిల్‌దే హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 18: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీనే తిరిగి అధికారంలోకి రానుందని విజయవాడ మాజీ ఎంపీ, ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. తన ఎగ్జిట్‌పోల్స్ సర్వే వివరాలను ఆదివారం సాయంత్రం తిరుపతిలో వేంకటేశ్వరుని సన్నిధిలో వెల్లడిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో తన సర్వే విఫలం కావటానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. వాటిని 23వ తేదీ వెల్లడిస్తానన్నారు. ఆంధ్రతో పాటు తెలంగాణలో లోక్‌సభకు గత నెల 11వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీ వస్తుందనేది ఆదివారం తిరుపతిలో వివరిస్తానని చెప్పారు. తన సర్వేలో స్వల్పంగా మార్పులు, చేర్పులు ఉండవచ్చన్నారు. అయితే మొత్తంగా ఏపీ ప్రజలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకే మొగ్గు చూపారన్నారు. ఇది తన అంచనా మాత్రమే అని తేల్చి చెప్పారు. శనివారం రాజధాని వెలగపూడి వీ స్క్వేర్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన ఏపీ భవిష్యత్ రాజకీయ ముఖచిత్రాన్ని విశే్లషించారు. ఆదివారం 7వ దశ పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్‌పోల్స్ సర్వేను ప్రకటిస్తామన్నారు. ప్రపంచంతో పాటు దేశవ్యాప్తంగా ప్రధానంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆసక్తితో ఉన్నారన్నారు. రాష్ట్రాల భవిష్యత్ కేంద్రంతో ముడిపడి ఉందన్నారు.
కొత్త రాష్ట్రం అనేక ఇబ్బందులను ఎదుర్కొందని చెప్తూ 60 శాతం జనాభాకు 40 శాతం నిధులు మాత్రమే కేటాయించారని గుర్తుచేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులు ఫలితాల పట్ల ఆసక్తితో ఉన్నారని, వారికి చెవిలో తన సర్వే వివరాలను వెల్లడించినట్లు చెప్పారు. ప్రజల ఆశల్ని నెరవేర్చాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. కేంద్రం సహకారం ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతాయన్నారు. గత 15 సంవత్సరాల తన రాజకీయ సర్వేలలో తెలంగాణలో తప్ప ఏనాడూ అంచనాలు తప్పలేదన్నారు. తాను తిరుపతిలో చెప్పేదే ఫలితాల రోజు నిజమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సర్వేలు చెప్పడం తన హాబీ అని నమ్మటం, నమ్మకపోవటం అనేది ప్రజల అభీష్టమన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో డబ్బు ప్రభావం బాగా పనిచేసిందన్నారు. ప్రజల నాడి తెలుసుకోవటం శాస్ర్తియ ప్రక్రియగా అభివర్ణించారు. అన్ని వర్గాల ప్రజల మనోభావాలను సర్వేలో అంచనా వేస్తారన్నారు. ఫలితాలు కచ్చితంగా ఉంటేనే విశ్వసనీయత పెరుగుతుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు విడిగా వస్తే ఒకలా.. అసెంబ్లీ, పార్లమెంట్‌కు కలిపి నిర్వహిస్తే మరోలా సర్వే ఫలితాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. తన సర్వేలో ప్రజల నాడి ప్రస్ఫుటమైందనే నమ్మకం తనకు ఉందన్నారు. ఇది తన సర్వే టీం అందించిన వివరాలు కావని వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని వివరణ ఇచ్చారు. ఏపీలో మూడు పార్టీలు పోటాపోటీగా తలపడ్డాయని ఏ పార్టీకి ఎంత మెజారిటీ వచ్చిందనేది మరి కొద్ది గంటల్లో వెల్లడిస్తామన్నారు. మూడు పార్టీల్లో ఒకరే విజేతగా నిలుస్తారని మరొకరు ప్రతిపక్షంలో ఉంటారన్నారు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా అభివృద్ధికి అంతా కలసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో హంగ్ రాదన్నారు. ఒక పార్టీకే ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఉవ్వబోతున్నారని తెలిపారు. పవన్‌కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ ఈసారి అసెంబ్లీలోకి అడుగుపెడుతుందని అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకంటే తక్కువ సీట్లు రావచ్చని చెప్పారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన భవితవ్యం కూడా తన సర్వేలో తేలుతుందన్నారు. తనకు టీడీపీ కంటే వైఎస్ కుటుంబంతోనే అనుబంధం ఎక్కువుందని వైఎస్ వివేకా మరణించిన రోజున ఆయన కుటుంబాన్ని పరామర్శించి జగన్‌ను కూడా కలిసినట్లు తెలిపారు. తనకు ఏ పార్టీతో శత్రుత్వం లేదన్నారు.
*
చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న లగడపాటి