రాష్ట్రీయం

22న నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ 46 రాకెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మే 18: మరో అంతరిక్ష ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్ధమయింది. ఈ నెల 22న ఉదయం 5:57గంటలకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ ఎల్‌వీ-సీ 46 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు. ఈ రాకెట్ ద్వారా రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (రీశాట్-2బి) ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ప్రయోగానికి సంబంధించిన ప్రయోగాత్మక ప్రయోగం (రిహార్సల్) ఆదివారం నిర్వహించనున్నారు. రిహార్సల్‌లో భాగంగా రాకెట్‌ను మోబైల్ సర్వీసు టవర్ నుంచి మెల్లగా బయటకు తీసుకొచ్చి మళ్లి వెనక్కి తీసుకెళ్లనున్నారు. దీనికి సంబంధించిన చివరి మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) ఈ నెల 20న షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో డాక్టర్ బిఎన్ సురేష్ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో షార్ డైరెక్టర్ పాండ్యన్‌తో పాటు శాస్తవ్రేత్తలందరూ పాల్గొని ప్రయోగం సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఎంఆర్‌ఆర్ అనంతరం అదే రోజు షార్ డైరెక్టర్ ఆధ్వర్యంలో లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు వారు (ఎల్‌ఎబి) సమావేశమై ప్రయోగానికి సంసిద్ధత తెలపనున్నారు. ప్రయోగ కౌంట్‌డౌన్‌ను 25గంటలు ముందు అనగా ఈ నెల 21న తెల్లవారు జామున 4:57 గంటలకు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 300కిలో బరువుకలిగిన ఈ ఉపగ్రహంలో ఎక్స్‌బాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. భూమి మీద జరిగే మార్పులను ప్రకృతి వైపరీత్యాల సమయంలో నాణ్యమైన చిత్రాలను తీసిపంపే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ ఉపగ్రహం సైనిక సేవలకు ఎక్కువగా ఉపయోగపడనుంది. ఇప్పటికే రాకెట్ నాలుగు దశల అనుసంధాన పనులు పూర్తిచేసి శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రీయను కూడా శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. అన్ని సజావుగా సాగితే ఈ నెల 22న ఉదయం 5:57గంటలకు షార్‌లోని ప్రధమ ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ 46 రాకెట్ నింగిలోకి ఎగరనుంది.