రాష్ట్రీయం

ఆర్టీసీ ప్రమాదాలపై ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: ఇటీవల ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతున్న సంఘనలపై రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాలపై అధికారులతో మంత్రి శనివారం సచివాలయంలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అద్దె బస్సులకు సంబంధించిన ప్రమాదాలు ఎక్కవగా జరుగుతున్నాయని మంత్రి దృష్టికి అధికారులు తీసుకురావడంతో వారు చెబుతున్న సమాధానాలతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జరుగుతున్న సంఘటనలపై స్పందించే కంటే ముందస్తుగా ప్రమాదాల నివారణకు ఏమేరకు ప్రతిపాదనలు రూపొందించారో వాటి వివరాలను తనకు ఇవ్వాలని మంత్రి సూచించడంతో అధికారులు ఖంగుతిన్నారు. భద్రతకు మారుపేరు గాంచిన ఆర్టీసీలో ప్రమాదాల ఘటనలు జరగకుండా ప్రయత్నాలు చేయాలన్నారు. అద్దె బస్సు డ్రైవర్లు సరైన డ్రైవింగ్ సూచనలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తన దృష్టికి వచ్చినట్లు మంత్రి అధికారులకు వివరించారు. బస్సును నడుపుతున్న సమయంలో డ్రైవర్లు సెల్‌ఫోన్లలో మాట్లాడడం, పాన్, గుట్కాలు నమలడం, మద్యం తాగి బస్సుల డ్రైవింగ్ చేయడం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైతే తక్షణం సంబంధింత డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అద్దె బస్సుల డ్రైవర్ల పేరు బ్లాక్‌లిస్టులో పెట్టడంతోపాటు ఉద్యోగం నుంచి తొలగిస్తామన్నారు. ప్రమాద రహిత డ్రైవర్లకు ప్రత్యేక ప్రోత్సాహకంతోపాటు వారిని ప్రోత్సహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బస్సు జీవితకాల పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. 13.5 లక్షల కిలోమీటర్లు లేదా 15 సంవత్సరాల పాటు పనిచేసే విధంగా చూడాలని ఆయన అధికారులకు సూచించారు.
చిత్రం...సచివాలయంలో జరిగిన సమావేశంలో అధికారులతో మాట్లాడుతున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి