రాష్ట్రీయం

సర్వేల్లోటీఆర్‌ఎస్‌కే మొగ్గు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: పార్లమెంట్ ఎన్నికల తుది దశ పోలింగ్ ముగిసాక జాతీయ స్థాయిలో వివిధ సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌లో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి దాదాపు అన్ని సీట్లను కైవసం చేసుకోనుందని అంచనా వేశాయి. టీఆర్‌ఎస్ పార్టీ అంచనాలకు తగ్గట్టుగానే ఎంఐఎం పోటీ చేసిన ఒక్క స్థానాన్ని మినహాయించి మిగిలిన 16 పార్లమెంట్ స్థానాలకు గాను టీఆర్‌ఎస్ 14 నుంచి 16 సీట్లను గెలుచుకోబోతుందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం మోగించినట్టుగానే పార్లమెంట్ ఎన్నికల్లోను తన సత్తా చాటుకున్నట్టు వివిధ సంస్థలు వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన దాదాపు అన్ని సంస్థలు టీఆర్‌ఎస్ పార్టీ ఖచ్చితంగా 14 సీట్లు
గెలుచుకుంటుందని అంచనా వేశాయి. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌కు కేవలం 2 స్థానాలు మాత్రమే దక్కనున్నటుట దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అలాగే భారతీయ జనతా పార్టీ ఒకే ఒక్క స్థానాన్ని గెలిచే అవకాశం ఉన్నట్టు ప్రకటించాయి. ఆర్జీ ప్లాష్ టీమ్ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్‌ఎస్ 14 నుంచి 16 స్థానాలను, కాంగ్రెస్ పార్టీ 0-2 స్థానాలు, ఎంఐఎం-1, బీజేపీ-0 స్థానాలు గెలుచుకోనున్నట్టు ప్రకటించాయి. ఈ ఒక సంస్థ మాత్రమే బీజేపీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోదని ప్రకటించింది. కాగా న్యూస్-18 సంస్థ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్‌ఎస్ 12-14 స్థానాలను, కాంగ్రెస్-1-2 స్థానాలు, ఎంఐఎం 1, బీజేపీ-1-2 స్థానాలు గెలుచుకుంటాయని ప్రకటించాయి. ఎన్డీటీవీ సంస్థ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్‌ఎస్-12, కాంగ్రెస్-2, ఎంఐఎం-1, బీజేపీ-1 స్థానాలను గెలుచుకుంటాయని పేర్కొన్నారు. ఇండియా టు డే ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్‌ఎస్ 10-12, కాంగ్రెస్ 1-3 స్థానాలు, ఎంఐఎం-1, బీజేపీ-1 గెలుచుకోనున్నట్టు ప్రకటించింది. సీ ఓటర్ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్‌ఎస్-14, కాంగ్రెస్-1, ఎంఐఎం-1, బీజేపీ-1 గెలుచుకుంటాయని పేర్కొన్నారు. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్‌ఎస్-13, కాంగ్రెస్-2, ఎంఐఎం-1, బీజేపీ-1 గెలుచుకుంటాయని పేర్కొన్నారు. టు డే చాణక్య ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్‌ఎస్ 12-16, కాంగ్రెస్ 1-2, ఎంఐఎం-1, బీజేపీ-1 గెలుచుకునే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా లగడపాటి ప్రకటించిన ఆర్జీ ఫ్లాష్ టీమ్ సంస్థ మాత్రమే బీజేపీకి ఒక్క స్థానం కూడా దక్కదని పేర్కొన్నారు. ఇలా ఉండగా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఫలితాలకు భిన్నంగా రాష్ట్రంలో వివిధ పార్టీలు ఇంకా ఎక్కువ స్థానాలనే గెలుచుకోనున్నట్టు అంచనా వేస్తున్నాయి. మిత్రపక్షం ఎంఐఎం పోటీ చేసిన ఒక స్థానం మినహా మిగిలిన 16 సీట్లు తమవేనని టీఆర్‌ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. కచ్చితంగా ఐదు స్థానాలను గెలుచుకోనున్నట్టు కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఆరు స్థానాలకు గట్టి పోటీ ఇచ్చిన తాము పక్కాగా నాలుగు స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. వీటిలో మల్కాజ్‌గిరి, చేవెళ్ల, నల్లగొండ, భువనగిరి ఉన్నాయి. కాగా ఇవే కాకుండా ఖమ్మం, పెద్దపల్లి, జహీరాబాద్ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ అంచనా వేస్తోంది. బీజేపీ అంచనాల మేరకు సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ మూడు స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ పక్కగా రెండు స్థానాలను గెలుచుకోవడం ఖాయమని అంచనా వేస్తోంది. వీటిలో సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ రెండు స్థానాలు తమవేనని ధీమా వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్, పార్టీల అంచనాలు ఎలా ఉన్నా ఎవరెన్ని స్థానాలను గెలుచుకున్నది తేలడానికి ఈ నెల 23 వరకు వేచి చూడాల్సిందే.